అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన బీజేపీ సీనియర్ నేత

Update: 2019-08-09 16:34 GMT
భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత - కేంద్ర ఆర్థిక శాఖ మాజీ మంత్రి అరుణ్ జైట్లీ ఎయిమ్స్ లో చేరారు. శ్వాస సంబంధిత ఇబ్బందితో ఆయన ఆసుపత్రిలో చేరినట్టుగా వార్తలు  వస్తున్నాయి. అరవై ఆరేళ్ల వయసున్న జైట్లీ గత కొంతకాలంగా అనారోగ్యంతో ఇబ్బంది పడుతూ ఉన్నారు.

ఇటీవల మోడీ కేబినెట్ లో స్థానం దక్కే అవకాశం ఉన్నా ఆయన తీసుకోలేదు. తనకు ఆరోగ్యం బాగోలేదని ఆయన పదవిని తిరస్కరించారు. గత టర్మ్ లోనే ఆయన మంత్రిగా పూర్తిగా బాధ్యతలు నెరవేర్చలేకపోయారు. కీలకమైన బడ్జెట్ ప్రకటన కూడా చేయలేకపోయారు.

దీంతో అప్పుడు  ప్రత్యామ్నాయంగా పీయుష్ గోయల్ బడ్జెట్ ప్రకటన చేశారు. విదేశాల్లో అప్పుడు జైట్లీ చికిత్స పొందారు. ఇప్పుడు ఆయన ఎయిమ్స్ లోని కార్డియో-న్యూరో సెంటర్లో అడ్మిట్ అయినట్టుగా తెలుస్తోంది.
ఇటీవలే సుష్మాస్వరాజ్ హఠాన్మరణం భారతీయ జనతాపార్టీ ని విషాదంలోకి నెట్టింది.
Tags:    

Similar News