ఆంధ్రప్రదేశ్ లో సోదాలు చేపట్టే అధికారాన్ని సీబీఐకి నిరాకరిస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సంచలనం సృష్టిస్తోంది. తమ పార్టీ నేతల నివాసాలు - కార్యాలయాల్లో ఇటీవలి సీబీఐ సోదాలు భవిష్యత్తులో మరిన్ని సోదాలు జరుగుతాయనే భయాల నేపథ్యంలోనే చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారన్న చర్చ జరుగుతోంది. సీబీఐ తన అధికారాలను వినియోగించుకోనేందుకు గతంలో ఇచ్చిన సమ్మతి నోటిఫికేషన్ ను ఉపసంహరించుకుంటూ ఏపీ సర్కార్ గురువారం ఉత్తర్వులు జారీచేసిన ఫలితంగా అక్కడ కేంద్ర ప్రభుత్వశాఖలు - కేంద్ర ప్రభుత్వ రంగసంస్థల్లో పనిచేసే ఉద్యోగుల నివాసాలు - కార్యాలయాల్లో తనిఖీలు చేసే అవకాశం సీబీఐకి ఉండదు. సీబీఐ పరిధి రద్దవుతుంది. అయితే దీనిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ ఈ ఎపిసోడ్ పై ఘాటుగా స్పందించారు.
ఢిల్లీ మినహా మిగతా రాష్ర్టాల్లో సీబీఐ తన అధికారాలను వినియోగించుకోవాలంటే ఆయా రాష్ర్టాల సాధారణ అనుమతి అవసరం. ఏపీలోకి సీబీఐ ప్రవేశానికి వెసులుబాటు కల్పించే ఈ సమ్మతి ఉత్తర్వులను చంద్రబాబు ప్రభుత్వం ఉపసంహరించుకున్న తీరుపై జైట్లీ తాజాగా స్పందిస్తూ...
ఏదైనా జరుగుతుందేమోననే భయంతోనే ఏపీలోకి సీబీఐని రానీయకుండా నిర్ణయం తీసుకున్నారని ఆయన ఎద్దేవా చేశారు. అవినీతి విషయంలో ఏ రాష్ట్రానికీ సార్వభౌమాధికారం లేదని జైట్లీ స్పష్టం చేశారు. తమ తప్పులను కప్పిపుచ్చుకోవడానికే సీబీఐని రాష్ట్రంలోకి అనుమతించడం లేదని ఆయన పేర్కొంటూ పరోక్షంగా ఏపీ సర్కారు అవినీతిని ప్రస్తావించారు.
ఇదిలాఉండగా...తాజా ఆదేశంతో ఇకపై ఏపీలో సీబీఐ పాత్రను రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో ఉండే ఏసీబీని పోషిస్తుంది. అంటే రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోని దర్యాప్తు సంస్థే...రాష్ట్రంపై వచ్చిన అవినీతిని దర్యాప్తు చేస్తుంది! ఇదే ఈ నిర్ణయం వెనుక అసలు మతలబని పలువురు నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. అవినీతి కేసుల విషయంలో బాబు భయపడుతున్నారని, వాటినుంచి తప్పించుకునేందుకు.. తమ నేతలపై సోదాలు జరుగకుండా ఈ నిర్ణయం తీసుకున్నారని నాయకులు, మేధావులు అభిప్రాయపడుతున్నారు. ఈ సర్క్యులర్ ఏ మేరకు న్యాయబద్ధమైనదనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.