కేజ్రీపై ఈసీ ఈ రేంజ్ లో సీరియస్ అయ్యింది!

Update: 2017-01-21 16:41 GMT
ఢిల్లీ సీఎం, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ పై ఎన్నికల కమిషన్ సీరియస్ అయ్యింది. అవినీతిని ప్రోత్సహించేలా మాట్లాడుతున్నారని.. అంతే కాకుండా ఎన్నికల కమిషన్ ఇచ్చే నోటీసులకు స్పందించడంలేదని మండిపడింది. ఇదే కంటిన్యూ అయితే మాత్రం పరిణామాలు సీరియస్ గా ఉంటాయని, అవసరమైతే ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవడానికైనా వెనకాడేది లేదని హెచ్చరించింది. ఈసీ ఈ రేంజ్ లో స్పందించడానికి అరవింద్ కేజ్రీవాల్ చేసిన పనేమిటి, మాట్లాడిన మాటలేమిటి ఇప్పుడు చూద్దాం!

"ప్రత్యర్థి పార్టీలు డబ్బులిస్తే తీసుకోండి.. కానీ, ఓటు మాత్రం మా పార్టీకే వెయ్యండి" అని ఢిల్లీ సీఎం ఓటర్లకు సలహా ఇచ్చారు. జనవరి 8న గోవాలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ప్రసంగించిన ఆప్ అధినేత... "కాంగెస్, బీజేపీలు డబ్బులిస్తే తీసుకోండి.. అలాగే ఓటుమాత్రం ఆప్ కే వెయ్యండి" అని అన్నారు. ఈ విషయంపై సీరియస్ అయిన కాంగ్రెస్ పార్టీ, ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేసింది. దీంతో స్పందించిన ఈసీ జనవరి 19న తమ ముందు హాజరై వివరణ ఇవ్వాలని కేజ్రీకి నోటీసులు పంపింది.

అయితే... ఈ నోటీసులపై కేజ్రీ స్పందించలేదు, ఈసీ కి వివరణా ఇవ్వలేదు. దీంతో సీరియస్ అయిన ఎన్నికల కమిషన్... కేజ్రీవాల్ ధిక్కార స్వభావాన్ని ప్రదర్శిస్తున్నారని మండిపడింది. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పదే పదే ఉల్లంఘిస్తే కఠిన చర్యలకు వెనుకాడమని.. ఇకముందు కూడా ఇలాంటి ప్రకటనలు చేస్తూ, ఇలానే ప్రవర్తిస్తే.. పార్టీ గుర్తింపు రద్దు సహా ఎలాంటి కఠిన చర్యకైనా వెనుకాడేదిలేదని స్పష్టం చేసింది.

దీంతో ఎన్నికల కమిషన్ ఉత్వర్వుపై స్పందించిన కేజ్రీ... ఈసీ నిర్ణయాన్ని కోర్టులో సవాల్ చేస్తానని, తనపై ఈసీ ఇచ్చిన ఉత్వర్పులు పూర్తిగా తప్పని.. ట్వీట్టర్‌లో పేర్కొన్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News