ఈవీఎంలు వ‌ద్దు..బ్యాలెట్లు ముద్దు అంటున్న‌సీఎం

Update: 2017-03-14 14:46 GMT
ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత‌, ఢిల్లీ సీఎం సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ ఆస‌క్తిక‌ర‌మైన డిమాండ్ చేశారు. ఈవీఎంలు కాకుండా బ్యాలెట్ పేప‌ర్ల‌తోనే ఢిల్లీ మున్సిప‌ల్ ఎన్నిక‌లు నిర్వ‌హించాల‌ని కేంద్ర ఎన్నిక‌ల సంఘాన్ని కోరిన‌ట్లు తెలుస్తోంది. త్వ‌ర‌లో ఢిల్లీలో మున్సిప‌ల్ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఈ నేప‌థ్యంలో పేప‌ర్ బ్యాలెట్‌ను వాడే విధంగా ఎన్నిక‌ల క‌మీష‌న్‌కు లేఖ రాయాల‌ని చీఫ్ సెక్ర‌ట‌రీకి సీఎం కేజ్రీవాల్ ఆదేశాలు జారీ చేసిన‌ట్లు తెలుస్తోంది. అనేక రాష్ట్రాల్లో మున్సిప‌ల్ ఎన్నిక‌లు బ్యాలెట్ పేప‌ర్ల‌తోనే నిర్వ‌హిస్తున్నార‌ని, అందుకే రాబోయే ఢిల్లీ మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లోనూ బ్యాలెట్ పేప‌ర్‌ను వాడాల‌ని ఆమ్ ఆద్మీ పార్టీ ఎన్నికల సంఘాన్ని కోరింది. ఢిల్లీ కాంగ్రెస్ నేత అజ‌య్ మాకెన్ సైతం కేజ్రివాల్ డిమాండ్‌కు మ‌ద్ద‌తిచ్చారు. పుర‌పాల‌క ఎన్నిక‌ల్లో బ్యాలెట్ పేప‌ర్‌ను వాడాల‌ని ఈసీని కోరారు.

మూడు మున్సిప‌ల్ కార్పొరేష‌న్ల‌కు ఏప్రిల్‌ లో ఎన్నిక‌లు నిర్వ‌హించ‌నున్నారు. ఏప్రిల్ 22న ఢిల్లీలో మున్సిపల్ ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ నేప‌థ్యంలోనే ఈవీఎంల స్థానంలో బ్యాలెట్ పేప‌ర్ల‌తో ఎన్నిక‌లు చేప‌ట్టాల‌ని కేజ్రీవాల్ కోరారు. అయితే కేజ్రీవాల్ చేసిన అభ్యర్థనను రాష్ట్ర ఎన్నికల సంఘం కొట్టిపారేసింది. రాబోయే ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో ఈవీఎంలనే వాడనున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమీషనర్ శ్రీవాత్సవ్ తెలిపారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News