మజ్లిస్ ను తమ మిత్రుడిగా చెప్పుకునే తెలంగాణ అధికారపక్షానికి.. సమయానికి తగ్గట్లుగా పంచ్ లు పడుతున్న సంగతి తెలిసిందే. తాజాగా అలాంటి పంచ్ మరోసారి పడింది. పేరుకు మిత్రుడే కానీ.. మజ్లిస్ నేతలు ఎప్పుడు ఎలా వ్యవహరిస్తారో అర్థం కానట్లుగా ఉంటారు. తాము మిత్రపక్షం ఉన్న ప్రతిపార్టీ మీదా ఫైర్ కావటం తెలిసిందే. తాజాగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పై ఆయన చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగానే కాదు.. అసద్ అండ్ కోను టీఆర్ ఎస్ నేతలు మిత్రులుగా వ్యవహరించే అవకాశం లేకుండా చేశారని చెప్పొచ్చు.
మెదక్ జిల్లా సిద్ధిపేటలో ఏర్పాటు చేసిన సభలో మాట్లాడిన అసదుద్దీన్ ఓవైసీ.. కాంగ్రెస్.. తెలుగుదేశం పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు తెలంగాణ అధికారపక్షంలోకి వెళ్లారే తప్పించి.. మజ్లిస్ నేతలు ఎవరూ వెళ్లలేదని.. హైదరాబాద్ లో అన్ని పార్టీలు దెబ్బ తిన్నా.. తమ పార్టీ మాత్రం మరింత బలపడిందని వ్యాఖ్యానించారు.
తెలంగాణలో టీఆర్ ఎస్ ప్రభుత్వం ఎవరిని నోరెత్తకుండా చేస్తుందని వ్యాఖ్యానించిన అసద్.. టీఆర్ఎస్ ధాటికి కాంగ్రెస్.. టీడీపీ.. బీజేపీలు విలవిల్లాడినా మజ్లిస్ మాత్రం ఏ మాత్రం చెక్కుచెదర్లేదని వ్యాఖ్యానించారు. మిత్రుడినని చెప్పుకుంటూనే విమర్శలు చేస్తున్న అసద్ ను కేసీఆర్ ఇంకెంతకాలం ఫ్రెండ్ గా చూస్తారో..?