ఆల్ ఇండియా మజ్లిస్-ఏ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) పార్టీ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. 2024 ఎన్నికల్లో మోదీని సింగిల్ గా ఎదుర్కోలేమని తెలిపారు. విపక్షాలు అన్నింటిని తరఫున ఉమ్మడి అభ్యర్థిని ప్రధాని పదవికి ప్రకటించాలని కోరారు.
అలా కాకుండా అరవింద్ కేజ్రీవాల్, రాహుల్ గాంధీ ఇలా వేర్వేరుగా ఎవరికి వారే పోటీ చేస్తే మాత్రం నరేంద్ర మోదీని ఓడించడం కష్టమని అభిప్రాయపడ్డారు. వేటికవి సింగిల్ గా పార్టీలు పోటీ చేస్తే మోదీకే లాభం చేకూరుతుందని చెప్పారు. బీజేపీని ఓడించేందుకు ప్రతి ఒక్క నియోజకవర్గంలో విపక్షాలన్నీ కలిసికట్టుగా పనిచేయాలన్నారు.
2024లో జరిగే లోక్‌సభ ఎన్నికల్లో సస్పెండ్ అయిన బీజేపీ నేత నుపుర్ శర్మ ఢిల్లీ నుంచి పోటీ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదని అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. బీజేపీ మాజీ జాతీయ అధికార ప్రతినిధి నుపుర్ శర్మ గతేడాది జూన్ నెలలో ఒక న్యూస్ ఛానెల్‌లో జరిగిన చర్చలో మహ్మద్ ప్రవక్తపై చేసిన వ్యాఖ్యలతో పార్టీ నుంచి సస్పెన్షన్ కు గురయిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో నుపుర్ శర్మపై బీజేపీ తీసుకున్న చర్యపై ఒవైసీ అభ్యంతరాలు తెలిపారు. 2024న ఆమె ఖచ్చితంగా తిరిగి వచ్చి బీజేపీ తరపున ఎన్నికల్లో బరిలోకి దిగుతుందని జోస్యం చెప్పారు. బీజేపీ ఆమెను ఖచ్చితంగా ఉపయోగించుకుంటుందని తెలిపారు. ఆమెను లోక్‌సభ ఎన్నికల్లో ఢిల్లీ నుంచి బరిలోకి దింపినా ఆశ్చర్యపోనవసరం లేదన్నారు.
కాగా గతేడాది ఓ న్యూస్ ఛానల్‌లో చర్చ సందర్భంగా బీజేపీ అధికారి ప్రతినిధి నుపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా, విదేశాల్లోని ముస్లింలకు ఆగ్రహం తెప్పించిన సంగతి తెలిసిందే. పలు ముస్లిం దేశాలు భారత్ పై ఆగ్రహం వ్యకం చేశాయి. దౌత్య సంబంధాల విషయంలో ఆ దేశాలతో భారత్ ఒడిదుడుకులు ఎదుర్కొంది.
కాగా ఇప్పుడు అసదుద్దీన్ ఓవైసీ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. వాస్తవానికి అసదుద్దీన్ పైనే విపక్షాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. ఆయా రాష్ట్రాల ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తూ ముస్లింల ఓట్లను అసదుద్దీన్ చీల్చుతున్నారని.. దీని ఫలితంగా విపక్షాల ఓటుబ్యాంక్ చెల్లాచెదరవుతుందని ఆరోపిస్తున్నాయి. దీంతో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోయి బీజేపీకి లబ్ధి చేకూరుతుందని ఆరోపిస్తున్నారు. ఇందుకు పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను నిదర్శనంగా చూపుతున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.