గ్రేటర్ ఎన్నికల సందర్భంగా తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డిని కారులో నుంచి బయటకు లాగి మరీ దాడి చేసిన ఘటనకు సంబంధించి మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ తనకు తానుగా పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి.. షబ్బీర్ అలీలపై దాడికి సంబంధించి పోలీసులు కేసు నమోదు అయినప్పటికీ.. దాని గురించి పెద్దగా పట్టని అసద్.. యూపీలో జరుగుతున్న ఉప ఎన్నిక ప్రచారానికి వెళ్లిపోవటం తెలిసిందే.
గ్రేటర్ ఎన్నికల పోలింగ్ రోజు (ఫిబ్రవరి 2న)న దాడి పాల్పడిన ఉదంతంలో ఆయనపై కేసు నమోదు జరిగితే.. ఈ రోజు ఆయన పోలీసుల ఎదుట తనకు తాను సరెండర్ అయ్యారు. అనంతరం ఆయన్ను పోలీసులు వైద్య పరీక్షల కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. పరీక్షల అనంతరం ఆయన్ను నాంపల్లి కోర్టులో జడ్జి ముందు హాజరుపర్చనున్నారు. ఇప్పటికే ఈ కేసులో ఆరుగురిని అరెస్ట్ చేయగా నలుగురికి బెయిల్ వచ్చింది. మరి.. అసద్ విషయంలో నాంపల్లి కోర్టు నిర్ణయం ఏలా ఉంటుందన్నది ఇప్పుడు ఉత్కంటగా మారింది.