పార్టీ జెండా మోసినా.. మరేం చేసినా సరే.. తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) 21వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు మాత్రం కేవలం 3500 మందిని మాత్రమే పిలవటం తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లో ఒక రాజకీయ పార్టీ వెయ్యి కోట్ల ఆస్తులు ఉండటం గులాబీ పార్టీకే సాధ్యమేమో?
అలాంటి సంపన్న అధికార పార్టీ నిర్వహించే ప్లీనరీకి కేవలం 3500 మందిని మాత్రమే ఆహ్వానించటం.. వచ్చే ప్రతి ఒక్కరికి వాహన పాస్.. ఎంట్రీ పాస్ రెండింటిని అందజేశారు. అంతేనా.. ఈ ఎంట్రీ పాస్ లో బార్ కోడ్ పెట్టటం ద్వారా.. దాన్ని స్కానింగ్ చేసి మాత్రమే సభాస్థలికి అనుమతించారు.
హైసెక్యూరిటీతో పాటు.. కేవలం పరిమిత సంఖ్యలో ఆహ్వానాలు పంపిన ప్లీనరికి రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్ మీద హత్యాయత్నం చేసినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రధాన నిందితుడు మున్నూరు రవి ప్లీనరికి రావటం సంచలనంగా మారింది.
ప్లీనరీలోకి ఎంట్రీ ఇవ్వటమే కాదు.. టీఆర్ఎస్ పార్టీకి చెందిన పలువురు నేతలతో కలిసి ఫోటోలు దిగటం మరింత ఆశ్చర్యకరంగా మారింది. మంత్రి హత్య కేసులో కీలక నిందితుడు పార్టీ ప్లీనరీకి రావటం ఏమిటి? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.
ఈ ఇష్యూ ఇప్పుడు కలకలాన్ని రేపింది. హైసెక్యూరిటీ నడుమ ప్లీనరీ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసినట్లుగా గులాబీ నేతలు చెబుతున్నప్పటికీ.. మంత్రిపై జరిగిన హత్యాయత్నం కేసులో ప్రధాన నిందితుడు ప్లీనరి జరిగే సభా స్థలి వద్దకు ఎలా వచ్చారన్న ప్రశ్న తలెత్తుతోంది. హైసెక్యురిటీ ఎంట్రీ పాస్ ఉన్న వారికే ప్లీనరికి వచ్చే అవకాశం ఉన్న వేళ.. మున్నూరు రవి లోపలకు ఎలా వచ్చారు? అతడి వద్ద పాస్ ఉందా? అన్నది ప్రశ్నగా మారింది.
విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం మున్నూరు రవి వద్ద హైసెక్యురిటీ పాస్ లేదంటున్నారు. మరి.. పాస్ లేకున్నా లోపలకు ఎలా వచ్చారు. పార్టీ నేతలతో ఆయన ఫోటోలు ఎలా దిగారు? అన్నది ప్రశ్నగా మారింది. ఇదిలా ఉంటే.. ప్లీనరికి వచ్చిన రవి.. గులాబీ నేతలతో తాను దిగిన ఫోటోల్ని తన సోషల్ మీడియాలో పోస్టు చేయటంతో ఈ విషయం బయటకు వచ్చింది. ఈ వ్యవహారం రచ్చగా మారుతుందన్న విషయాన్ని గుర్తించి.. తన సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేసిన ఫోటోల్ని డిలీట్ చేయటం గమనార్హం.