అసెంబ్లీ సమావేశాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మీద రోజాపై ఏడాది సస్పెన్షన్ వేటు వేయటం తెలిసిందే. దీనిపై కోర్టులో వ్యాజ్యం నడుస్తోంది. మరోవైపు ఇష్యూను సెటిల్ చేసుకునేందుకు ఏనీ అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ తమ ముందు హాజరు కావాల్సి ఉంది. జరిగిన అంశాల మీద బాధను వ్యక్తం చేయటమో.. మనసును నొప్పించి ఉంటే క్షమించాలని కోరటం లాంటివి చెబితే.. ఆమె సస్పెన్షన్ ఎత్తి వేసే అవకాశం ఉంది. అయితే.. ప్రివిలేజ్ కమిటీ ముందు హాజరు కావటానికి రోజా పెద్దగా సుముఖత వ్యక్తం చేయటం లేదన్న మాట వినిపిస్తోంది.
మొండితనం.. తనదే పైచేయి కావాలనుకోవటం లాంటి లక్షణాలు ఉన్న రోజా.. ప్రివిలేజ్ కమిటీ ముందు హాజరు కావాలంటూ నాలుగుసార్లు ఆమెకు నోటీసులు ఇచ్చినా.. ఏదో కారణం చెప్పి ఆమె హాజరు కాకుండా ఉంటున్నారు. ఈ మధ్యన పిలిచినప్పుడు కూడా ఆరోగ్యాన్ని సాకుగా చూపించి ఆమె హాజరు కాలేదన్న విమర్శ ఉంది. ఇదిలా ఉంటే.. తాజాగా ఆమెకు మరో అవకాశాన్ని ఇస్తూ ఏపీ అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ ఆదేశాలు జారీ చేసింది.
ఈ నెల ఆరో తేదీన తమ ముందు హాజరు కావాలని కోరనుంది. తన సస్పెన్షన్ మీద న్యాయపోరాటానికే మొగ్గు చూపుతున్న రోజా.. ఇష్యూను సెటిల్ చేసుకోవటానికి కమిటీ ముందు హాజరు అవుతారా? అన్నది ఒక ప్రశ్నగా ఉంది. రోజా విషయంలో పట్టువిడుదల ధోరణితో వ్యవహరించాలన్న భావనలో ఏపీ సర్కారు ఉన్నట్లు చెబుతున్నారు. మరి.. కమిటీ తాజా ఆదేశాలకు రోజా సానుకూలంగా స్పందిస్తారా? లేదా? అన్నది ఆసక్తికరంగా మారింది. రోజా మైండ్ సెట్ తెలిసిన వారు మాత్రం.. ఆమె కమిటీ ముందు హాజరయ్యే ఛాన్స్ లేదని.. నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటే మాత్రం.. అలాంటివేమన్నా జరిగే అవకాశం ఉందంటున్నారు. రోజా రియాక్షన్ ఏమిటన్నది తేలాలంటే.. మరో నాలుగు రోజులు వెయిట్ చేస్తే తేలిపోనుంది.