తీరికలేని దిగ్గజాలు.. తీరిక చేసుకున్న వేళ.. మురిసిన 'వాంఖడే'
ఇలానే.. బాలీవుడ్ దిగ్గజ నటుడు.. సూపర్ స్టార్ అబితాబ్ బచ్చన్ సహా.. ఆయన కుమారుడు .. అభిషేక్ బచ్చన్ కూడా టీ-20 ఫైనల్ మ్యాచ్‌ను పక్కపక్కన కూర్చుని ఆశాంతం ఆస్వాదించారు.
వారంతా క్షణం తీరిక లేని నాయకులు, నటులు. సామాన్యులకే కాదు.. అసామాన్యులకు కూడా.. పట్టుమని పదినిమిషాల కంటే కూడా సమయం కేటాయించలేనంగా బిజీగా గడిపే వారే వారంతా! అయితే.. వీరంద రని ఉండ చుట్టి.. మోసుకువచ్చినట్టు ముంబైలోని వాంఖడే స్టేడియం.. టీ-20 ఫైనల్స్‌కు తీసుకువ చ్చిం ది. ఐదు నిమిషాల సమయం కూడా చిక్కని వారంతా గంటల తరబడి.. స్టేడియంలో కూలబడి.. మ్యాచ్‌ను ఆసాంతం ఆనందంగా వీక్షించారు. ఇంగ్లండ్‌తో జరిగిన ఫైనల్‌లో భారత్ విజయం దక్కించుకున్న విషయం తెలిసిందే.
ఈ మ్యాచ్‌ను వీక్షించేందుకు అనేక మంది వచ్చినా.. వీరిలో తమకంటే ప్రత్యేకతే కాదు.. తమకంటూ.. అతి పెద్ద అభిమానులను సైతం నిర్మించుకున్నవారు కూడా ఈ జాబితాలో ఉండడం గమనార్హం. వారంతా ఒకే స్టేడియంలో కొలువు దీరి.. భారత ఆడగాళ్ల ప్రతిభను ఆసాంతం వీక్షించారు. వీరిలో ప్రపంచ ప్రఖ్యాత ఐటీ దిగ్గజ సంస్థ.. ఇన్ఫోసిస్ అధినేత నారాయణ మూర్తి, ఆయన అల్లుడు, బ్రిటన్ మాజీ ప్రధాని రుషి సునాక్ వంటివారు ఉన్నారు. వీరి రేంజ్ ఏమిటో అందరికీ తెలిసిందే.
ఇలానే.. బాలీవుడ్ దిగ్గజ నటుడు.. సూపర్ స్టార్ అబితాబ్ బచ్చన్ సహా.. ఆయన కుమారుడు .. అభిషేక్ బచ్చన్ కూడా టీ-20 ఫైనల్ మ్యాచ్‌ను పక్కపక్కన కూర్చుని ఆశాంతం ఆస్వాదించారు. అదేవిధంగా భారత దిగ్గజ పారిశ్రామిక వేత్త ముఖేష్ అంబానీ కూడా.. వాంఖడేలో ప్రత్యేక దర్శనం ఇచ్చారు. భారత బౌలర్ల ధాటికి వీరంతా సాధారణ ప్రేక్షకుల మాదిరిగా కరతాళ ధ్వనులు చేస్తూ.. పరవశించారు. నిత్యం బిజీ షెడ్యూల్ తో క్షణం తీరిక లేకుండా ఉండే వీరంతా.. ఇలా హ్యాపీగా కనిపించడం ఒక విధంగా ఎనిమిదో వింతేనని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.
ఇంత లీజర్ టైం ఎలా చిక్కింది?
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక పరిణామాలు మారుతున్నాయి. భారత ప్రభుత్వం ఒక రోజు ముందే.. బడ్జట్‌ను ప్రవేశ పెట్టింది. మరోవైపు అమెరికా తీసుకునే నిర్ణయాలు ఆసక్తిగా మారాయి. ఈ నేపథ్యంలో ప్రపంచం తీరును అంచనా వేసేందుకు వీరికి.. కొంత సమయం కావాలి. ఇదే సమయంలో టీ-20 ఫైనల్ మ్యాచ్. పైగా.. భారత్-ఇంగ్లండ్ వంటి దిగ్గజ క్రీడాకారుల సమరం.. వీటికి తోడు.. సండే. ఈ మొత్తం కలిసి వచ్చి.. దిగ్గజ నటులు, పారిశ్రామిక వేత్తలు, నాయకులు ఒకే వేదికపై దర్శనమిచ్చారన్న మాట!!