ప్రపంచ వ్యాప్తంగా కరోనా కలకలం సృష్టిస్తుంది. ప్రస్తుతం కరోనాను అడ్డుకునే శక్తి ఒక్క వ్యాక్సిన్ కి మాత్రమే ఉంది అని నమ్ముతున్నారు. దీనితో అన్ని దేశాలు కూడా వ్యాక్సిన్ పై ప్రత్యేక దృష్టిని పెట్టాయి. ప్రస్తుతం వ్యాక్సిన్ కి ఉన్న డిమాండ్ నేపథ్యంలో విదేశాల్లో ఆస్ట్రాజెనికా టీకామందును ఉత్పత్తి చేసే యోచన ఉందని సీరం కంపెనీ సీఈఓ ఆదార్ పూనావాలా తెలిపారు. మరికొన్ని రోజుల్లో దీనిపై ప్రకటన చేస్తామన్నారు. జులై నాటికి తమ సంస్థ నెలకు 100 మిలియన్ డోసులను ఉత్పత్తి చేయగలదని ఆయన ఓ ఇంటర్వ్యూ లో తెలిపారు.
ఆరు నెలల్లోగా తమ ఉత్పాదక సామర్థ్యాన్ని సంవత్సరానికి 2.5 బిలియన్ డోసుల నుంచి 3 బిలియన్ డోసులకు పెంచుకోగలమని ఆశాభావం వ్యక్తం చేశారు. భారత్ లో కరోనా వైరస్ కేసులు పెరిగిపోతున్నాయని, ఈ సమయంలో తమ కోవిషీల్డ్ వ్యాక్సిన్ ఉత్పత్తిని కూడా పెంచాలనుకుంటున్నామని తెలిపారు. ఇలా ఉండగా విదేశాల నుంచి ఆక్సిజన్ సిలిండర్లు, ఇతర వైద్య పరికరాలు రాపిడ్ రెస్ట్ కిట్స్ మొదలైనవి అందుతున్నా యుధ్ద ప్రాతిపదికన వీటిని వినియోగించుకోవడంలో ప్రభుత్వం ఎందుకో జాప్యం చేస్తోందనే అభిప్రాయాలు వెల్లువెత్తుతున్నాయి. అమెరికా నుంచి సుమారు 10 కోట్ల డాలర్ల విలువైన సాయం అందిన సంగతి విదితమే. ఇకపోతే, ఇప్పటికే దేశంలో కరోనా మహమ్మారి పాజిటివ్ కేసులు 4 లక్షలపైగా నమోదు అవుతున్నాయి. అలాగే గత 24 గంటల్లో మూడున్నర వేలమంది రోగులు మరణించారు. ఈ నెల మొదటి వారంలో కేసులు ఇంకా పెరగవచ్చునని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఢిల్లీలోని పలు హాస్పిటల్స్ తీవ్రమైన ఆక్సిజన్ కొరత ను ఎదుర్కొంటున్నాయి.