ఆయిల్ పై ఆశ 123 మందిని చంపేసింది

Update: 2017-06-25 07:39 GMT
రోడ్లపై ట్రక్కులు బోల్తాపడి అందులోని వస్తువులు కిందపడితే వాటికోసం సమీప ప్రాంతాలవారంతా రావడం.. చేతికి దొరికింది ఎత్తుకెళ్లడం తరచూ చూసే విషయమే.  కాస్త విలువైన వస్తువులైతే ఇది మరింత ఎక్కువగా ఉంటుంది. అయితే... పాకిస్థాన్ లోనూ ఇలాగే ఆశపడిన కొందరు ప్రాణాలు కోల్పోయారు.
    
పాకిస్థాన్ లోని పంజాబ్ రాష్ట్ర పరిధిలోని బహావల్ పూర్ సమీపంలోని అహ్మద్ పూర్ షర్కియా వద్ద ఇలా లారీలో సరకు కోసం ఎగబడి ప్రమాదవశాత్తూ 123 మంది ప్రాణాలు కోల్పోయారు.  ఓ చమురు ట్యాంకర్ రోడ్డుపై బోల్తా పడటంతో, అందులోని ఆయిల్ మొత్తం బయటకు వచ్చేసింది. చుట్టు పక్కల ప్రజలు దాన్ని డబ్బాల్లో ఎత్తుకుని తీసుకెళ్లేందుకు ఎగబడ్డారు. ప్రజలు ఆయిల్ ను సేకరిస్తున్న సమయంలో దానికి మంటలు అంటుకుని క్షణాల్లో మంటలు వ్యాపించేశాయి.
    
చుట్టు మంటలు వ్యాపించడం.. తప్పించుకునే వీలు లేకపోవడంతో 123 మంది సజీవదహనం అయ్యారు.  మరో 40 మందికి తీవ్రంగా గాయపడ్డారు.  
    
కాగా నేలపాలైన చమురును అంతా సేకరిస్తున్న సమయంలో ఓ వ్యక్తి అక్కడ సిగరెట్ తాగి విసిరేయడం వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు గుర్తించారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News