అమ్మ ఆడియో క్లిప్పులు వ‌చ్చాయ్‌..ఇప్పుడే ఎందుకు?

Update: 2018-05-27 05:30 GMT
వారాల‌కు వారాలు అమ్మ ఆసుప‌త్రిలో ఉన్న వేళ‌.. కోట్లాది మంది ప్ర‌జ‌లు అమ్మ‌కు ఏమైంది?  ఎలా ఉంది? అని విప‌రీతంగా త‌పించారు. ఆమె మాట కోసం.. ఆమె ఎలా ఉంద‌న్న విష‌యాన్ని తెలిపే ఫోటో కోసం ప‌డిన ఆరాటం అంతా ఇంతా కాదు. అలాంటి వేళ‌.. అమ్మ‌కు సంబంధించిన ఏ అంశాన్ని బ‌య‌ట‌కు రానివ్వ‌లేదు. ఇదిలా ఉంటే.. తాజాగా అమ్మ‌కు సంబంధించిన ఆస‌క్తిక‌ర అంశాల్ని విడుద‌ల చేశారు.

అమ్మ జ‌య‌ల‌లిత మాట్లాడిన ఆడియో క్లిప్పుల్ని బ‌య‌ట పెట్టారు. అనారోగ్యంతో అపోలో ఆసుప‌త్రిలో చికిత్స పొందిన అమ్మ‌కు వైద్య సేవ‌ల్ని అందించే క్ర‌మంలో ఆమెకు.. ఆమెకు వైద్యం చేసిన వైద్యుడితో జ‌రిగిన సంబాష‌ణ‌ల రికార్డులు ఉన్నాయి. జ‌య మృతిపై ప‌లు సందేహాలు వెల్లువెత్తిన నేప‌థ్యంలో ఆమె మృతిపై విచార‌ణ జ‌రుపుతోంది జ‌స్టిస్ అర్ముగ స్వామి క‌మిష‌న్.

అమ్మ మృతిపై వ‌చ్చిన సందేహాల్ని తీర్చ‌టం.. ఆమె మ‌ర‌ణానికి కార‌ణం ఏమిట‌న్న‌ది తెలుసుకోవ‌టం క‌మిష‌న్ ల‌క్ష్యం. తాజాగా క‌మిష‌న్ విడుద‌ల చేసిన ఆడియో క్లిప్పుల్లో ఒక‌టి 1.07 నిమిసాల వ్య‌వ‌ధి ఉంది. అందులో డ్యూటీ డాక్ట‌ర్ తో అమ్మ జ‌య‌ల‌లిత మాట్లాడిన మాట‌లు ఉన్నాయి.

మీకు బీపీ ఎక్కువ‌గా ఉంది. 140 ఉంద‌ని డ్యూటీ డాక్ట‌ర్ చెప్ప‌గా.. ఇది త‌న‌కు మామూలే అని జ‌య‌ల‌లిత సంతృప్తి వ్య‌క్తం చేసిన‌ట్లుగా ఉంది. శ్వాస తీసుకోవ‌టంలో త‌న‌కు ఇబ్బందులు ఎదుర‌వుతున్నాయ‌ని అమ్మ చెప్పారు. ఈ సంద‌ర్భంగా డాక్ట‌ర్ శివ‌కుమార్ కు తాను ఎదుర్కొంటున్న ఇబ్బందిని వివ‌రిస్తూ.. శ్వాస తీసుకున్న‌ప్పుడు వ‌స్తున్న గుర‌క లాంటి శ‌బ్దం నాకు స్ప‌ష్టంగా వినిపిస్తోంది. అది సినిమా థియేట‌ర్లో అభిమానులు వేసే విజిల్స్ లా ఉంద‌ని అమ్మ పేర్కొన‌టం గ‌మ‌నార్హం.

క‌మిష‌న్ విడుద‌ల చేసిన మ‌రో క్లిప్ నిడివి 33 సెక‌న్లుగా ఉంది. అందులో డాక్ట‌ర్ శివ‌కుమార్ అమ్మ‌తో మాట్లాడారు. గ‌తంతో పోలిస్తే శ్వాస తీసుకుంటున్న‌ప్పుడు వ‌స్తున్న శ‌బ్ద తీవ్ర‌త త‌గ్గింద‌ని జ‌య‌ల‌లితతో ఆయ‌న అన్నారు. దీనికి స్పందించిన అమ్మ‌.. గుర‌క‌లాంటి శ‌బ్దం ఎక్కువ‌గా ఉండ‌గానే రికార్డు చేసేందుకు మొబైల్ అప్లికేష‌న్ డౌన్ లోడ్ చేయ‌మ‌ని తాను చెప్పిన విష‌యాన్ని గుర్తు చేశారు. అప్పుడేమో మీరు కుద‌ర‌ద‌న్నారంటూ అమ్మ వ్యాఖ్యానించారు. దీనికి బ‌దులిచ్చిన కుమార్‌.. మీరు చెప్పిన వెంట‌నే మొబైల్ లో డౌన్ లోడ్ చేశాన‌ని స‌మాధానం చెప్పారు.

ఈ రెండు ఆడియో క్లిప్పుల‌తో పాటు.. అమ్మ మెనూను కూడా బ‌య‌ట‌కు వెల్ల‌డించారు. అయితే.. ఇదంతా తూత్తుకూడిలో జ‌రిగిన కాల్పుల ఘ‌ట‌న తీవ్ర‌త‌ను త‌గ్గించుకునేందుకు.. ప్ర‌జ‌ల దృష్టిని ప‌క్క‌కు మ‌ర‌ల్చేందుకేన‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.

వీడియో కోసం క్లిక్ చేయండి

Full View
Tags:    

Similar News