నంద్యాల నియోజకవర్గ సీనియర్ నేత భూమా నాగిరెడ్డి-శోభానాగిరెడ్డి తనయ - తెలుగుదేశం పార్టీ యువమంత్రి భూమా అఖిలప్రియకు పార్టీలో వ్యతిరేకత రోజురోజుకు పెరుగుతున్నట్లు కనిపిస్తోంది. నిన్నటికి నిన్న అఖిలప్రియ తీరును తప్పు పడుతూ సీనియర్ నేత శిల్పా మోహన్ రెడ్డి వైసీపీలో చేరగా...తాజాగా భూమా సన్నిహితుడైన ఏపీ సుబ్బారెడ్డి సంచలన ప్రకటన చేశారు. మంత్రి అఖిల ప్రియపై తిరుగుబాటుకు దిగిన టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డి.. తనకు వైసీపీ నుంచి ఆఫర్ ఉందంటూ సంచలన ప్రకటన చేశారు. దివంగత నేత భూమా నాగిరెడ్డికి తాను కుడి భుజంలా ఉండేవాడినని అయిత తనకు భూమా ఇచ్చిన ప్రాధాన్యతలో మంత్రి అఖిల ప్రియ పాతిక శాతం కూడా ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అఖిల ప్రియ తనను ఎందుకు పక్కపెట్టారో అర్థం కావాడం లేదన్న ఆయన… ఈ విషయంపై కేంద్రమంత్రి సుజనా చౌదరి కూడా పిలిచి మాట్లాడారని పేర్కొన్నారు.
నంద్యాలలో భూమా వర్గాన్ని తానే తయారు చేశానని సుబ్బారెడ్డి చెప్పారు. నంద్యాల టీడీపీ కౌన్సిలర్లు అంతా తనకే మద్దతుగా ఉన్నారని తెలిపారు. వైసీపీ నుంచి ఆఫర్ ఉన్నప్పటికీ నంద్యాల ఉప ఎన్నిక పూర్తయ్యే వరకు టీడీపీ కోసం పనిచేస్తానని తెలిపారు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తనకు తెలియదని నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. మరోవైపు ఈ ప్రకటన కంటే ముందు టీడీపీ కౌన్సిలర్లతో అత్యవసరంగా ఏవీ సుబ్బారెడ్డి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కౌన్సిలర్లను అఖిల వైపు ఉంటారో, తనవైపు ఉంటారో తేల్చుకోవాలని సూచించారు.
మరోవైపు జిల్లా నేతలకు హైకమాండ్ నుంచి పిలుపు వచ్చింది. ఈ మేరకు శనివారం కర్నూలు జిల్లా నేతలతో సమావేశం కానున్న పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మంత్రి అఖిల ప్రియ - పార్టీ నేత సుబ్బారెడ్డి మధ్య నెలకొన్న విభేదాలపై చర్చించనున్నారు. త్వరలో అక్కడ ఉప ఎన్నిక జరగనున్న నేపథ్యంలో.. విబేధాల వల్ల పార్టీకి నష్టం కలుగుతుందని పార్టీ పెద్దలు అభిప్రాయపడుతున్నారు. దీనిపై పార్టీ పెద్దలు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి మరి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/