చిక్కుల్లో అజారుద్దీన్.. అమిత్ షాకు ఫిక్సింగ్ పై ఫిర్యాదు?

Update: 2021-03-21 23:30 GMT
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు అజారుద్దీన్ మ్యాచ్ ఫిక్సింగ్ కేసు దర్యాప్తును సీబీఐ పునర్విచారణ చేయాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలువనున్నట్లు తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు, బీజేపీ నేత యెండెల లక్ష్మీనారాయణ సంచలన ప్రకటన చేశారు. అజారుద్దీన్ కేవలం ఎన్నికలలో పోటీచేయడానికి కోర్ట్ నుంచి తాత్కాలిక అనుమతి మాత్రమే తీసుకున్నాడన్నారు. తనపై ఉన్న మ్యాచ్ ఫిక్సింగ్ అభియోగాలు మాత్రం తప్పించుకోలేడని యెండల తెలిపారు.

అజారుద్దీన్ కు మ్యాచ్ ఫిక్సింగ్ నుంచి క్లీన్ చిట్ కూడా లభించలేదని.. మొన్న జరిగిన సెలక్షన్ లో కూడా చాలా అవకతవకలు జరిగాయని తెలిపారు. లీగ్ మ్యాచ్ లలో ప్రతిభ కనబరిచిన ఆటగాళ్లకు చోటు దక్కలేదని విమర్శించారు.

హెచ్.సీఏను ప్రక్షాళన చేసి ప్రతిభ గల క్రీడాకారులకు అవకాశాలు కల్పించడం మానేసి గ్రామీణ క్రీడాకారులను వెలికితీసే పనుల్లో ముందున్న మాపై విమర్శలు చేస్తారా అని యెండల మండిపడ్డారు.

బీసీసీఐ నుంచి వస్తున్న నిధులు ఎక్కడికి పోతున్నాయని.. మూడేళ్లుగా ఎందుకు హెచ్.సీ.ఏ ఆడిటింగ్ రిపోర్ట్ కూడా సబ్ మిట్ చేయలేదని యెండల ప్రశ్నించారు. హైదరాబాద్ క్రికెట్ ను మరింత అవినీతి మయం చేసిన అజార్ పై అమిత్ షాకు ఫిర్యాదు చేస్తామన్నారు.
Tags:    

Similar News