చంద్రబాబు ప్రతిపక్ష నాయకుడు. దానితో పాటు ఆయన ఒక పెద్ద పార్టీకి అధ్యక్షుడు. ఇక మూడు సార్లు ముఖ్యమంత్రిగా చేసిన వారు. వయసు రిత్యా అనుభవం రిత్యా సీనియర్ నేత. అలాంటి చంద్రబాబుకు ప్రోటోకాల్ ప్రకారం క్యాబినేట్ ర్యాంక్ మంత్రి హోదాలో ప్రభుత్వం అన్ని రకాలైన ఏర్పాట్లు చూడాలి.
ఇదిలా ఉంటే చంద్రబాబు గోదావరి జిల్లాల వరద బాధితులను పరామర్శించడం కోసం రెండు రోజుల పర్యటనను పెట్టుకున్నారు. బాబు ఈ సందర్భంగా చేసే బసగా పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్‌ను ఎంపిక చేశారు.
అయితే ఆ విషయం తెలిసి చేశారా అన్నట్లుగా పాలకొల్లులోని స్థానిక అధికారులు రామచంద్ర గార్డెన్స్‌కు విద్యుత్ సరఫరాను నిలిపివేశారని, దీంతో ఇక రాత్రంతా బాబు బస చేసే చోట అసలు విద్యుత్ ఉండదని ప్రాథమిక సమాచారంగా చెబుతున్నారు. దీని మీద టీడీపీ నాయకులు మండిపడుతున్నారు. ఇది సైకో చర్యలుగా వారు తప్పుపడుతున్నారు.
నిజానికి ఇక్కడ విద్యుత్ పునరుద్ధరణకు చర్యలు చేపడుతున్నప్పటికీ ఫలించకపోవడంతో వారు కావాలనే ఇదంతా అధికార పార్టీ వారు చేయించారని ఫైర్ అవుతున్నారు.
ఇలా చంద్రబాబు పర్యటనలో వైసీపీ ప్రభుత్వం ఆటంకాలు సృష్టిస్తోందని టీడీపీ అధికారిక ఫేస్ బుక్ లో పెట్టి మరీ టీడీపీ వారు వైసీపీ తప్పును ఎత్తి చూపుతున్నారు
మరీ ఇంత దారుణంగా బాబుని టార్గెట్ చేయడం కోసం ఎన్ని మెట్లు దిగజారుతారని కూడా తమ్ముళ్లు ప్రశ్నిస్తున్నారు. ఇలా చేయడం వల్ల ప్రభుత్వం పట్ల వ్యతిరేకత ఇంకా పెరుగుతుంది తప్ప తగ్గదని కూడా అంటున్నారు.
ఇదిలా ఉండగా పాలకొల్లులో ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో విద్యుత్ సదుపాయం లేకపోవడంతో చంద్రబాబు కోసం ఆల్టర్నేషన్ గా వేరే బసను ఎంపిక చేస్తున్నట్లుగా చెబుతున్నారు. మొత్తానికి బాబు మీద మరీ ఇంతలాగా అన్న చర్చ అయితే సాగుతోంది.