సినిమాల నుంచి రాజకీయాల్లోకి వెళ్లి తమ ప్రతిభను పరీక్షించుకున్న నటులెందరో మన టాలీవుడ్‌లో ఉన్నారు. వారిలో కొందరు పూర్తిగా రాజకీయాలకే అంకితమై ప్రజాసేవ చేస్తుండగా.. మరికొందరు అనుకున్నది సాధించలేక తిరిగి యథాస్థానానికి వచ్చిన వారు మాత్రం కొందరే ఉన్నారు. అలాంటి వారిలో మెగాస్టార్ చిరంజీవి పేరు చెప్పుకోవచ్చు. సినిమాలకు ఇక గుడ్‌బై అని చెప్పి రాజకీయాల్లోకి వెళ్లిన ఆయన అందులో ఇమడలేక తిరిగి సినీ ఫీల్డుకు వచ్చి సినిమాల్లో నటిస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఓ సీనియర్ టాలీవుడ్ కమెడియన్ పరిస్థితి ఇప్పుడు అదే విధంగా తయారయ్యేలా ఉంది. కమెడియన్ గా ప్రేక్షకుల నుంచి ప్రశంసలు పొందిన బాబుమోహన్ ఎన్టీఆర్ హయాంలోనే రాజకీయాల్లోకి వచ్చారు. ఆ తరువాత జయాపజయాలను సాధించుకుంటూ మొత్తానికి మంత్రి పదవి దాకా వెళ్లారు. టీడీపీ మీద అభిమానంతో ఆ పార్టీలోకి వెళ్లిన ఆయన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత టీఆర్ ఎస్ లోకి జంప్ చేశారు.
ఇక్కడా ఆయన ప్రత్యేక రాష్ట్రం ఊపులో ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అయితే మొన్న జరిగిన ఎన్నికల్లో టీఆర్ ఎస్ టికెట్ దక్కకపోవడంతో కేసీఆర్ పై కోపంతో బీజేపీలోకి చేరారు. అయితే ఇక్కడ ఆయనపై మొదటిసారి టీఆర్ ఎస్ అభ్యర్థిగా పోటీచేసిన జర్నలిస్టు కాంత్రికిరణ్ విజయం సాధించడం విశేషం. దీంతో ఇప్పుడు బాబూమోహన్ పరిస్థితి రెండికి చెడ్డ రేవడిలా మారింది.
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలోని చెన్నూర్ - ఆందోల్ టిక్కెట్లు మాత్రం సిట్టింగ్ లకు కాకుండా కొత్తవారికి కేసీఆర్ అవకాశమిచ్చారు. అయితే చెన్నూర్ బరిలో ఉన్న ఓదెలు మొదట ఆందోళన చేసినా ఆ తరువాత పార్టీ అధినేత హామీ ఇవ్వడంతో టీఆర్ ఎస్ లోనే కొనసాగుతున్నారు. అయితే ఆందోల్ నుంచి టికెట్ చేజారిన బాబుమోహన్ మాత్రం బీజేపీలోకి చేరి చేతులు కాల్చుకున్నాడని పలువురు అనుకుంటున్నారు. పార్టీలోనే ఉంటే ఎమ్మెల్సీ పదవో లేక ఇతర నామినేటెడ్ పోస్టు దక్కేదని ఆ పార్టీ నాయకులు పేర్కొంటున్నారు.
దీంతో ప్రస్తుతం ఆయన చేసేదేమీ లేక సినిమాల వైపుకు మళ్లుతున్నట్లు తెలుస్తోంది. అయితే చిరంజీవి లాంటి వారిని ఎంతసేపు చూసినా బోరు కొట్టకపోవచ్చు. కానీ బాబుమోహన్ మళ్లీ కమెడియన్ గా మెప్పించగలడా అని చర్చించుకుంటున్నారు. రాజకీయాల్లో ఉంటూనే మధ్యలో కొన్ని సినిమాల్లో నటించిన బాబుమోహన్ ప్రస్తుతం కంప్లీట్ గా సినీ జీవితానికే అంకితం కానున్నారు.