నిజంగా అభివృద్ధి కోరుకునే వారికి ఇది బ్యాడ్ న్యూస్. అందునా విశాఖను పరిపాలనా రాజధానిగా చేస్తామని ఈ రోజుకీ ఒట్టేసి చెబుతున్న ఏపీ సర్కార్ కి ఇంకా చేదు వార్త. విశాఖ అంటే స్మార్ట్ సిటీ. విశాఖ అంటే ఐటీ సిటీ. విశాఖ అంటే సినీ రాజధాని. ఇలా అనేక రకాలుగా కితాబులు అందుకుంటూ వేయి మతాబుల్లా వెలిగిపోవాల్సిన నగరం ఇపుడు ఎందుకో డిమ్ అయిపోతోంది. కళ తప్పిపోతోంది. వస్తావనుకున్న ఐటీ కంపెనీలు రాక పోగా ఉన్నవి కూడా టాటా చెప్పి వెళ్లిపోతున్న దీన స్థితి.
ఒక విధంగా మెగా సిటీకి ఇది షాకింగ్ లాంటి పరిణామమే. విశాఖలో రెండు దశాబ్దాల క్రితం ఏర్పాటు అయిన హెచ్ఎస్‌బీసీ గుడ్ బై చెప్పేస్తోంది. సీ సిటీకి బై బై అనేస్తోంది. దాని వెనక ఆ కంపెనీ అంతర్గత కారణాలు ఉన్నాయని అంటున్నా రెండు దశాబ్దాలకు పైగా సిటీలో ముడిపడిపోయి ఉత్తరాంధ్రా జిల్లాల ఉపాధికి ఊతమిచ్చే హెచ్ఎస్‌బీసీ తన భారీ క్యాంపస్ ఖాళీ చేసి వెళ్లిపోవడం అంటే విశాఖ వాసులకే కాదు, ఏపీ ప్రజానీకానికి బాధాకరమైన వార్తగానే చూడాలి.
విశాఖకు ఐటీ లుక్ ఇవ్వడానికి వచ్చిన మొదటి వరస కంపెనీలలో హెచ్ఎస్‌బీసీ ఒకటి. ఇది అగ్రశేణి సంస్థ. నాడు చంద్రబాబు ఉమ్మడి ఏపీకి సీఎం గా ఉన్న కాలంలో విశాఖ నడిబొడ్డున బ్రహ్మాండమైన ప్లేస్ చూపించి మరీ హెచ్ఎస్‌బీసీని ఒప్పించి రప్పించారు. ఈ ఇరవై ఏళ్లలో ఆకర్షణీయమైన జీతాలతో విశాఖ యువత సహా చుట్టు పక్కల జిల్లాల వారు బాగా లబ్ది పొందారు. అంతే కాదు, హెచ్ఎస్‌బీసీని చూసి మరిన్ని పేరున్న కంపెనీలు కూడా ఐటీ రూట్ విశాఖే అని రావడం మొదలెట్టాయి.
అది అలా సాగుతూండగానే రాష్ట్రం ముక్కలైంది. దాంతో కొంత ఆటంకం వచ్చినా చంద్రబాబు విభజన ఏపీకి సీఎం అయ్యాక విశాఖకు ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ కంపెనీకి తీసుకురావాలనుకున్నారు. భూములు కూడా కేటాయించారు. అయితే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వాటి మీద అరోపణలు చేసి రద్దు చేసింది. తిరిగి ఆ భూములు ఇస్తామని చెప్పినా కూడా ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ మాత్రం నో చెప్పేసి వెళ్ళిపోయింది. ఆ తరువాత గత ప్రభుత్వం నిర్మించిన మిలీనియం టవర్స్‌ను కూడా ఎవరికీ కేటాయించలేదు.
ఈ నేపధ్యంలో ఐటీ కళ తప్పి విశాఖ బోసిపోతోంది. ఏది ఎలా ఉన్నా హెచ్ఎస్‌బీసీ లాంటి దిగ్గజ కంపెనీ మాత్రం విశాఖ నుంచి వెళ్లిపోవడం అంటే ఈ సిటీకి ఏమైంది అనిపించకమానదు. మరో వైపు చూస్తే హైదరాబాద్ ఉమ్మడి ఏపీలో ఐటీకి కేరాఫ్ అన్నట్లుగా ఉండేది.
ఆ తరువాత అందరి చూపూ విశాఖ వైపే ఉండేది. విశాఖ మీద రాజకీయ క్రీనీడ పడకుండా ఉంటే అలాగే జరిగేది, హైదరాబాద్ ధీటుగా కాకపోయినా తరువాత వరసలో అయినా విశాఖ ఉండేది. కానీ విశాఖకు ఆ భాగ్యం లేకుండా పోయింది అన్నది తాజాగా హెచ్ఎస్‌బీసీ బై బై తో అర్ధమపొతోంది.
ఇంకో వైపు చూసుకుంటే తెలంగాణా సర్కార్ చూపుతున్న శ్రధ్ధ, ఐటీ కంపెనీలను ఒడిసిపట్టుకున్న నైపుణ్యం మూలంగా తెలంగాణాలో టైర్ టూ సిటీస్ కూడా ఇటీ సిటీస్ గా మారబోతున్నాయి. దానికి సిసలైన నిదర్శనంగా వరంగల్ నిలుస్తోంది. వరంగల్ లో జెన్ ఫ్యాక్ట్ తన క్యాంపస్ ని అక్కడ ఓపెన్ చేసేందుకు రెడీ అవుతోంది. అంటే అది అక్కడ ప్రభుత్వం ముందు చూపు అనుకోవాలి.
ఏపీలో ఉన్న రాజకీయ పరిస్థితులు, రాజకీయ కక్షలు, కార్పణ్యాలు ఇతరత్రా విషయాల కారణంగా అనేక కంపెనీలు రావాల్సినవి కూడా రాకుండా పోతున్నాయి అనే చెప్పాలి. నిజానికి విశాఖ నంబర్ వన్ సిటీ. ఇలాంటి సిటీకి ఐటీ కంపీనీలు రావడం లేదు అంటే అది నగరం తప్పు కాదు, కచ్చితంగా ఏలికల పాలసీల్లోనే ఎక్కడో ఏదో లోపం ఉందనుకోవాలేమో. ఏది ఏమైనా విశాఖకు ఐటీ లుక్ తెచ్చేందుకు ప్రస్తుత ప్రభుత్వం చాలా గట్టిగానే చర్యలు చేపట్టాలని అంతా కోరుతున్నారు.