బాల‌య్య‌.. చిర్రుబుర్రులేంద‌య్యా?

Update: 2017-06-24 07:58 GMT
నెల‌ల త‌ర‌బ‌డి నియోజ‌క‌వ‌ర్గాల్ని ప‌ట్టించుకోని ఎమ్మెల్యేలు ఏపీలో చాలామందే క‌నిపిస్తుంటారు. నిద్ర లేచిన ద‌గ్గ‌ర నుంచి త‌మ‌కేమాత్రం సంబంధం లేని హైద‌రాబాద్ మ‌హాన‌గ‌రంలో కాలం గ‌డిపేస్తున్నా.. అధినేత స్థానంలో ఉన్న ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ప‌ట్టించుకున్న‌ది లేదు.

మంత్రులు.. ఎంపీలు.. ఎమ్మెల్యేలు ప‌లువురు త‌మ నియోజ‌క‌వ‌ర్గాన్ని వ‌దిలేసి.. ఫ్యామిలీతో పాటు హైద‌రాబాద్ లో ఉంటున్న విష‌యంపై బాబు ఇప్ప‌టివ‌రకూ దృష్టి పెట్టింది లేదు. విభ‌జ‌న జ‌రిగి మూడేళ్లు దాటుతున్నా.. ఏపీని మ‌రింత బ‌లోపేతం చేసే విష‌యంలో బాబు ఇంకా ఒక క్లారిటీతో లేర‌న్న మాట వినిపిస్తోంది. ఎవ‌రి దాకా ఎందుకు.. త‌న సొంత బావ‌మ‌రిది క‌మ్ వియ్యంకుడైన హిందూపురం ఎమ్మెల్యే బాల‌కృష్ణ‌.. గ‌డిచిన మూడు నెల‌లుగా నియోజ‌క‌వ‌ర్గం ముఖాన్ని చూడ‌ని వైనాన్ని మ‌ర్చిపోలేం.

నెల‌ల త‌ర‌బ‌డి నియోజ‌క‌వ‌ర్గానికి రాని బాల‌య్య‌పై అక్క‌డి ప్ర‌జ‌లు తీవ్ర ఆగ్ర‌హంతో ఉన్నారు. స‌న్నిహితులు ఇచ్చిన స‌మాచార‌మో లేక బాల‌య్య మ‌న‌సుకే అనిపించిందేమో కానీ తాజాగా ఆయ‌న హిందూపురం ప‌ర్య‌ట‌న చేప‌ట్టారు. మొద‌టి రోజు త‌న ప‌ర్య‌ట‌న‌లో భాగంగా వివిధ సంద‌ర్భాల్లో ప‌లువురిపై చిర్రుబుర్రులాడ‌టం క‌నిపించింది.

ప్ర‌జాజీవితంలో ఉన్న వారికి ధ‌ర్మాగ్ర‌హం ఉండాలే త‌ప్పించి.. అన‌వ‌స‌రంగా అదే ప‌నిగా కోపం రావ‌టం బాగోదు. కానీ.. బాల‌య్య‌కు మాత్రం త‌ర‌చూ కోపం వ‌చ్చేస్తుంటుంది. చిన్న చిన్న విష‌యాల మీదా ఆయ‌న సీరియ‌స్ అయిపోతుంటారు.
హిందూపురం నియోజ‌క‌వ‌ర్గంలో తొలి రోజు బాల‌య్య ప‌ర్య‌ట‌న‌లో ఆయ‌న చిర్రుబుర్రులాడిన ఉదంతాలు ప‌లుమార్లు క‌నిపిస్తాయి. మండ‌ల కేంద్ర‌మైన చిల‌మ‌త్తూరు నుంచి బైక్ మీద వ‌స్తున్న వేళ‌.. లేపాక్షిలో ఓ పోలీసు అధికారిపై సీరియ‌స్ అయ్యారు. త‌ర్వాత హిందూపురం ప్ర‌భుత్వ ఆసుప‌త్రి భ‌వ‌న ప్రారంభ స‌మ‌యంలో ఫోటోల‌కు అడ్డు వ‌స్తున్నారంటూ 11వ వార్డు మున్సిప‌ల్ కౌన్సిల‌ర్ రామ్మూర్తిపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

అదే స‌మ‌యంలో ప‌క్క‌నే ఉన్న ఆసుప‌త్రి సూప‌రింటెండెంట్ కేశ‌వులను ప‌క్క‌కు వెళ్లాలంటూ చిర్రుబుర్రులాడారు. పూజ జ‌రిగే వేళ‌లో ఆర్చ‌కుడి మీదా బాల‌య్య అస‌హ‌నం వ్య‌క్తం చేయ‌టం అంద‌రి దృష్టిని ఆక‌ర్షించ‌ట‌మే కాదు.. బాల‌య్య‌కు మ‌రీ ఇంత త్వ‌ర‌గా ఆగ్ర‌హం ఎందుకు వ‌స్తుందంటూ మాట్లాడుకోవ‌టం క‌నిపించింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News