బాల‌య్య ఇలాకాలో అవినీతి రాజ్యం

Update: 2016-05-26 17:39 GMT
తండ్రి వార‌స‌త్వాన్ని న‌ట‌న‌లోనే గాక‌.. రాజ‌కీయాల్లోనూ కొన‌సాగిస్తున్నారు నంద‌మూరి బాల‌కృష్ణ‌. ఎన్టీఆర్ అడుగుజాడ‌ల్లోనే న‌డుస్తూ.. తాను ఎన్నికైన హిందూపురం నియోజ‌క‌వ‌ర్గాన్ని ఆద‌ర్శంగా తీర్చిదిద్దుతున్నారు. అటు సినిమాలు.. ఇటు నియోజ‌క‌వ‌ర్గంలోని అభివృద్ధి ప‌నులు రెండింటినీ బ్యాలెన్స్ చేస్తూ త‌న‌దైన శైలిలో రాణిస్తున్నారు. నియోజ‌క‌వ‌ర్గంలో ఎప్పుడు ఏ స‌మ‌స్య వ‌చ్చినా.. వెంట‌నే తీరుస్తున్నారు. అయితే ఈ మ‌ధ్య బాల‌య్య నియోజ‌క‌వ‌ర్గంలో అవినీతి రాజ్య‌మేలుతోంద‌నే వార్త‌లు గుప్పుమంటున్నాయి.

హిందూపురం నియోజకవర్గంలో బాల‌య్య ఎన్నో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. హంద్రీనీవా ప్రాజెక్టును సకాలంలో పూర్తిచేస్తామని హామీ ఇచ్చారు. హిందూపురాన్ని రాష్ట్రంలో అభివృద్ధి చెందిన ప్రాంతంగా తయారు చేస్తామని ప్ర‌క‌టించారు. ఇందుకు త‌గిన ప్ర‌ణాళిక‌లు కూడా వేసుకుని ప‌క్కాగా దూసుకుపోతున్నారు. లేపాక్షి ఉత్స‌వాల‌ను ఒంటి చేత్తో నిర్వ‌హించి.. అంద‌రి మ‌న్న‌న‌లు అందుకున్నారు. నియోజ‌క‌వ‌ర్గంలో స‌మస్య‌ల‌ను కూడా ప‌రిష్క‌రిస్తున్నారు. అయితే ఇంత‌లా అభివృద్ధి చేసేందుకు బాల‌య్య క‌ష్ట‌ప‌డుతుంటే .. అంతేస్థాయిలో అవినీతి కూడా చాపకింద నీరులా పెరిగిపోతోందోంద‌ట‌. బాల‌య్య అవినీతి చేయ‌క‌పోయినా ఆయ‌న్ను అడ్డం పెట్టుకుని ఆయ‌న అనుచ‌రులు భారీగా అవినీతికి పాల్ప‌డుతున్నార‌న్న వార్త‌లు అక్క‌డ జోరందుకున్నాయి.

హిందూపురం అభివృద్ధి ఒక అడుగు ముందుకు ఇరవై అడుగులు వెనక్కి అన్న చందాన ఉందట‌. బాలకృష్ణ గెలిస్తే ఏదో చేస్తారు అనుకుంటే ఏమి చేయడం లేదని.. బాలయ్య తెరపై హీరో మాత్రమే అని రియల్ లైఫ్ లో జీరో అని సీపీఐ ఆరోపిస్తోంది. హిందూపురం అభివృద్ధిని పక్కన పెట్టి బాలయ్య సినిమాలను పట్టుకు తిరుగుతున్నారని, హిందూపురం ప్రజలను పట్టించుకోవడం లేదనే విమ‌ర్శ‌లు గుప్పుమంటున్నాయి. గ‌తంలో ఆయ‌న పీఏపైనా భారీ ఎత్తున అవినీతి ఆరోప‌ణ‌లు వ‌చ్చాయ‌న్న వార్త‌లను ఇప్పుడు గుర్తుచేస్తున్నారు. మ‌రి త‌న 100వ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్న బాల‌య్య‌కు ఈ అవినీతి గురించి తెలిస్తే ఎలా స్పందిస్తారో వేచిచూడాలి.
Tags:    

Similar News