హీరో కం ఎమ్మెల్యే నందమూరి బాలక్రిష్ణకు టీడీపీ తమ్ముళ్లు చుక్కలు చూపించారు. తన నియోజకవర్గం హిందూపురంకు చుట్టపు చూపుగా వచ్చిపోయే బాలయ్య ముందే బాహాబాహీకి దిగారు..దీంతో ఏదో మీటింగ్ పెట్టుకొని వెళ్లిపోదామనుకున్న బాలయ్యకు మైండ్ బ్లాంక్ అయిపోయింది.
తాజాగా బాలక్రిష్ణ తను ప్రాతినిధ్యం వహిస్తున్న అనంతపురం జిల్లాలోని హిందూపురం నియోజకవర్గంలో క్షేత్రస్థాయిలో పార్టీ పరిస్థితి తెలుసుకుందామని స్థానిక సాయిరాం ఫంక్షన్ హాల్ లో సమావేశం నిర్వహించారు. చిలమత్తూరు మండలంలోని నాయకులు - కార్యకర్తలను పిలిపించారు. సమావేశం ప్రారంభం కాగానే బాలయ్య ముందే నేతలు, కార్యకర్తలు కొట్టుకోవడంతో బాలయ్య అవాక్కయ్యారు.
చిలమత్తూరు మండలంలోని పంచాయతీల సమస్యలపై చర్చిస్తుండగా నాయకుల మధ్య విభేదాలు బయటపడ్డాయి. విభేధాలతో పార్టీ నాశనం అయిపోతోందని కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేశారు. పనులన్నింటినీ పర్సంటేజీలు ఇచ్చిన వారికే ఇస్తున్నారని.. కార్యకర్తలకు సాయం చేయడం లేదని మండిపడ్డారు. ఈ క్రమంలో స్థానిక నాయకులైన పాపన్న-వెంకటసుబ్బయ్యలు వాగ్వాదానికి దిగారు. వారికి బాలక్రిష్ణ పీఏ వీరయ్య, శివప్పలు నచ్చచెప్పి కూర్చోబెట్టారు. ఇంతలోనే మరో కార్యకర్త స్పందిస్తూ.. ‘నేతలు కార్యకర్తల రక్తం తాగుతున్నారని.. కనీసం విలువ కూడా ఇవ్వడం లేదని’ వాపోయాడు.
ఆ తర్వాత దళితుడైన గంగాధర్ ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం మీకు పూలదండ వేయడానికి వచ్చినా పక్కకు లాగేస్తున్నారని బాలక్రిష్ణ ఎదుట వాపోయారు. నాయకుల సమస్యలంతా విన్న బాలయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు.. ‘ఏ పంచాయతీతో ఏం జరుగుతుందో తనకు అన్నీ తెలుసునని.. ఎక్స్ ట్రా చేస్తే తాట తీస్తానంటూ’ అక్కడున్న వారందరినీ హెచ్చరించారు. 20 నుంచి పంచాయతీల్లో పర్యటిస్తానని..అన్నీ చూసి ఒక్కొక్కరికీ ఏం చేయాలో అది చేస్తానని హామీ ఇవ్వడంతో సభ సజావుగా ముగిసింది.