కొన్ని ప్రశ్నలు చిరాకు పుట్టిస్తుంటాయి. కొన్ని ప్రశ్నలు అడుగుతుంటే మరింత ఉత్సాహంగా సమాధానం చెప్పాల్సి ఉంటుంది. తాజాగా ఏపీ ఎమ్మెల్యే బాలకృష్ణకు రెండో అనుభవం ఎదురైంది. తన అల్లుడు గురించి అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చే క్రమంలో.. ఉత్సాహంగా సమాధానం ఇచ్చారు బాలయ్య. తాజాగా ఎమ్మెల్యేలు ఎన్నుకునే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిగా లోకేశ్ ను ఎంపిక చేయటంపై బాలకృష్ణను ప్రశ్నించింది మీడియా.
ఈ సందర్భంగా రియాక్ట్ అవుతూ.. పార్టీకి లోకేశ్ చేసిన సేవల్ని గుర్తించిందని.. ఇప్పటికే పార్టీ సభ్యత్వ నమోదు దగ్గర నుంచి పార్టీ కార్యాలాపాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లటంలో లోకేశ్ ఇప్పటికే తానేంటో చూపించారని.. ఎమ్మెల్సీ పదవికి ఆయన అర్హుడని వ్యాఖ్యానించారు. పార్టీ అంశాల విషయంలోనూ.. ప్రజా సమస్యల విషయంలోనూ లోకేశ్ నిబద్ధతతో ఉన్నారని.. పార్టీ కార్యక్రమాల కోసం కష్టపడుతున్నారని బాలకృష్ణ చెప్పారు.
ఎమ్మెల్సీగా ఆయన బాధ్యతలు మరింత పెరగనున్నట్లుగా చెప్పిన బాలయ్య మాటల్ని విన్నంతనే కొన్ని సందేహాలు చటుక్కున మనసులో మెదులుతాయి. పార్టీ అధికారంలోకి వచ్చి మూడేళ్లకు దగ్గరవుతున్న వేళలోనే లోకేశ్ ను గుర్తించటం ఏమిటి? వారసత్వ రాజకీయాల మీద ఇప్పటివరకూ విమర్శలు చేసిన చంద్రబాబు.. తన కొడుక్కి ప్రత్యక్ష ఎన్నికల ద్వారా కాకుండా పరోక్ష ఎన్నికల ద్వారా ఎన్నిక చేయటం ఏమిటి? బాబు మాదిరే.. మిగిలిన అధినేతలు సైతం తమ సంతానానికి పదవులు ఇచ్చే విషయాన్ని లోకేశ్ కు ఇచ్చిన కోణంలోనే ఇచ్చి ఉండొచ్చు కదా? మరి.. గతంలో ఇలాంటి అంశాలపై బాబు చేసిన విమర్శలకు ఇప్పుడేం సమాధానం చెబుతారు? లాంటి ప్రశ్నలకు సమాధానాలు చెబితే బాగుంటుందేమో? అయినా.. వారసత్వ రాజకీయాల గురించి మరో వారసుడ్ని ప్రశ్నలు అడిగితే సరైన సమాధానం వచ్చే అవకాశం ఉందా?
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/