రెండు రోజుల క్రితం ఊహించని లేఖ ఒకటి మీడియాలో, సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టిన సంగతి తెలిసిందే. అందులో.. తాను చేసింది తప్పేనని, తనను క్షమించాలని ఈటల కోరినట్టుగా ఉంది. అంతేకాదు.. వైద్యారోగ్యశాఖ మంత్రిగా ఉన్న సమయంలో ఈ లేఖ రాసినట్టుగా.. ఈటల లెటర్ హెడ్ మీద ఉండడంతో తీవ్ర కలకలం రేగింది.
దీన్ని బీజేపీ నాయకులు ఖండించారు. ఈటలపై దుష్ప్రచారం చేసేందుకు టీఆర్ఎస్ పన్నిన పన్నాగమే ఇదని ఆరోపించారు. అయితే.. గులాబీ నేతలు మాత్రం ఇది ఈటల రాసిందేనని అంటున్నారు. తాజాగా.. టీఆర్ఎస్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ సైతం ఈ విషయంపై స్పందించారు.
శనివారం నిర్వహించిన టీఆర్ఎస్ సోషల్ మీడియా అవగాహన సదస్సులో సుమన్ మాట్లాడారు. ఆ లేఖ ఈటల రాసిందేనని అన్నారు. బీజేపీ నేతలే తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. ఈ లేఖ ఈటల రాయలేదని బండి సంజయ్ హైదరాబాద్ భాగ్యలక్ష్మి అమ్మవారిపై ప్రమాణం చేస్తారా? అని ప్రశ్నించారు.
బీజేపీ నేతలు తనను బానిస అంటూ తిడుతున్నారని, ఆ తిట్లను దీవెనగానే భావిస్తానని చెప్పారు. మాజీ మంత్రి ఈటల రాజేందర్.. కేసీఆర్ పై చేస్తున్న విమర్శలు సరికాదని అన్నారు. టీఆర్ఎస్ పార్టీని, కేసీఆర్ ను ఈటల మోసం చేశారని ఆరోపించారు. తెలంగాణకు కేసీఆర్ నాయకత్వమే శ్రీరామరక్ష అని అన్నారు.