నిరుద్యోగుల ఆత్మహత్యలను ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన హత్యలు గానే బీజేపీ భావిస్తోందని ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. లక్షా 7 వేల పోస్టులు భర్తీ చేస్తానని సీఎం కేసీఆర్ నిరుద్యోగులను దారుణంగా మోసం చేశారని మండిపడ్డారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బీజేవైఎం ఆధ్వర్యంలో చేపట్టిన కోటి సంతకాల సేకరణలో భాగంగా తొలి సంతకం చేసిన బండి.. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఉద్యమ నాయకుడిగా కేసీఆర్ ఇచ్చిన హామీలేవీ సీఎం అయ్యాక అమలు చేయకుండా నిరుద్యోగులను నిలువునా మోసం చేశారని ధ్వజమెత్తారు.
ఇచ్చిన హామీలను నిలబెట్టుకోకపోవడం వల్లే నిరుద్యోగుల ఆత్మహత్యలు జరుగుతున్నాయని బండి అన్నారు. ధరణి పోర్టల్ ప్రారంభమై రెండేళ్లయిన సమస్యలు మాత్రం తీరలేదని విమర్శించారు. సీఎం మాటలు తెలంగాణ ప్రజలు నమ్మె పరిస్థితి లేకుండా పోయిందని విమర్శించారు. అందరం కలిసి మహోద్యమం నిర్మిద్దామని... అందులో భాగంగానే కోటి సంతకాల సేకరణ కార్యక్రమమని తెలిపారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ మిలియన్ మార్చ్ నిర్వహించి తీరుతామని స్పష్టం చేశారు.
ధరణి పోర్టల్ ప్రారంభమై రెండేళ్లయిన సమస్యలు మాత్రం తీరలేదని... ముఖ్యమంత్రి కేసీఆర్ మాటలకు... చేతలకు పొంతన లేకుండా పోయిందని బండి సంజయ్ ఆరోపించారు. రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది రైతులు, మాజీ సైనికాధికారులు సహా ప్రజలు దీనివల్ల అనేక కష్టాలు పడుతున్నా చర్యలు తీసుకోకపోవడం సిగ్గుచేటని విమర్శించారు. రాష్ట్రంలో ఉన్న మొత్తం భూముల్లో పోడు భూములు, పట్టా, అసైన్డు, పోరంబోకు, ఇనాం భూములెన్ని అనే విషయాలు ఇంతవరకు స్పష్టం చేయకపోవడం దారుణమన్నారు.
రాష్ట్రంలో సమగ్ర భూ సర్వే కోసం కేంద్ర ప్రభుత్వం వందల కోట్ల నిధులు మంజూరు చేసినా.. ఇప్పటికీ ఆ దిశగా చర్యలు తీసుకోకపోవడం బాధాకరమని బండి సంజయ్ అన్నారు. కేంద్ర నిధులను దారి మళ్లిస్తూ తన కుటుంబం, బినామీ సంస్థలకు ఉపయోగపడేలా... 'ధరణి' పోర్టల్‌ను తీర్చారని ఆరోపించారు. అసైన్డు భూముల రైతులకు శాశ్వత హక్కులు కల్పించాలని హైకోర్టు రెండు సార్లు తీర్పులిచ్చినా పట్టించుకున్న దాఖలాల్లేవన్నారు. ధరణి పోర్టల్... ప్రజా సమస్యల పరిష్కారానికా... వేల కోట్ల రూపాయల విలువైన భూములను దండుకోవడానికా అని ప్రశ్నించారు.