ఇంటర్నెట్ ను సాలెగూడుగా అభివర్ణిస్తుంటారు. ప్రపంచంలో ఎక్కడ నుంచైనా ఏమైనా చేసే అవకాశం ఇంటర్నెట్ ఇస్తుంది. దీన్ని అసరా చేసుకొని అద్భుతాలు సృష్టించిన వారు ఉన్నట్లే.. దీంతో వికారపు చేష్టలు చేసి అడ్డంగా బుక్ అయినోళ్లు చాలామందే ఉన్నారు. తాజాగా తనను తాను సెక్స్ సుల్తాన్ గా ప్రకటించుకొని వికారపు వీడియోలు అప్ లోడ్ చేస్తూ.. పలువురిని పక్కదారి పట్టిస్తున్న ఇంటర్నెట్ సెక్స్ సుల్తాన్ ను బంగ్లాదేశ్ పోలీసులు బుక్ చేశారు.
దాదాపు 150 మంది మహిళ జీవితాలతో ఆటలు ఆడుతున్న ఇతగాడి ఖేల్ ను బంగ్లాదేశ్ పోలీసులు ఖతం చేశారు. గడిచిన కొంతకాలంగా సంచలనంగా మారి.. ఎంతకూ అంతుచిక్కని ఇతగాడి ఉనికిని గుర్తించిన పోలీసులు.. తాజాగా అతడ్ని అరెస్ట్ చేయటంతో పాటు.. ఢాకాలోని అతడి ఇంట్లో ఉన్న భారీ పోర్నోగ్రఫీ డంప్ ను.. డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు.
కొంతకాలంగా సూపర్ హీరోల మాస్క్ లు ధరించిన ఈ ఉన్మాది ఇంటర్నెట్ లో అసభ్య వీడియోలను పోస్ట్ చేస్తున్న ఇతగాడి అసలు పేరు ఫౌద్ బిన్ సుల్తాన్ గా తేల్చారు. చేసేది రియల్ ఎస్టేట్ వ్యాపారం. అయితే.. ప్రవృతిగా కొందరు అమాయక మహిళల్ని లోబర్చుకొని వారి వీడియోలను చిత్రీకరించి బ్లాక్ మొయిల్ చేస్తున్నాడు.వారికి సంబంధించిన వీడియోలు అప్ లోడ్ చేసి పలువురిని ఆకర్షిస్తున్నాడు.
పోర్నోగ్రఫీపై బ్యాన్ ఉన్న బంగ్లాదేశ్ లో సుల్తాన్ తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు.. ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో.. రంగంలోకి దిగిన పోలీసులు అతడ్ని పట్టుకున్నారు. యాంటీ పోర్నగ్రఫీ చట్టం కింద అరెస్ట్ చేశారు. అతడిపై మోపిన కేసులు నమోదు అయితే.. దాదాపు పదేళ్ల జైలుశిక్ష పడే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. తనతో సెక్స్ చేసిన మహిళల్ని తానేమీ మోసగించలేదని.. వారికి వారే స్వచ్ఛందంగా వచ్చారని వాదిస్తున్నాడు. మరి.. దీనిపై కోర్టు ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.