విశ్వక్రీడల్లో త్వరలో క్రికెట్ ను చూడబోతున్నాం. లాస్ ఏంజిల్స్ వేదికగా 2028లో జరిగే ఒలింపిక్స్ లో క్రికెట్ ను భాగం చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఒలింపిక్స్ లో క్రికెట్ ను ప్రవేశపెట్టే దిశగా ఐసీసీ వేగంగా చర్యలు తీసుకొంటోంది. లాస్ ఏంజల్స్ లో జరిగే ఒలింపిక్స్ లో క్రికెట్ కు చోటు కల్పించేలా చర్యలు తీసుకుంటున్నట్టు మెరిల్ బోన్ క్రికెట్ క్లబ్, వరల్డ్ క్రికెట్ కమిటీ చైర్మన్ మైక్ గ్యాటింగ్ ఓ ప్రకటనలో తెలిపారు. ఇటీవల అంతర్జాతీయ డోపింగ్ వ్యతిరేక ఏజెన్సీ (వాడా) అనుబంధ జాతీయ డోపింగ్ నిరోధక ఏజెన్సీ (నాడా) పరిధిలోకి బీసీసీఐ రావడం కూడా ఒలింపిక్స్‌లో క్రికెట్ ప్రవేశానికి మార్గం సుగమమైందిని తెలుపుతోంది.
ఒలింపిక్స్ నిబంధనల ప్రకారం అన్ని క్రీడా సమాఖ్యలు వాడా పరిధిలోకి రావాల్సి ఉంటుంది. ఒలింపిక్స్ లో క్రికెట్ ను ప్రవేశపెట్టేందుకు చర్యలు వేగవంతం చేసినట్టు ఐసీసీ కొత్త సీఈవో మానూ సావ్నీ పేర్కొన్నట్టు ఎంసీసీ సమావేశం సందర్భంగా గ్యాటింగ్ తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా ఆదరణ ఉన్న ఆటల్లో క్రికెట్ ఒకటి. అలాంటి క్రికెట్ కు ఒలింపిక్స్ లో మాత్రం చోటు దక్కలేదు. చివరిసారి 1900లో పారిస్ లో జరిగిన ఒలింపిక్స్ లో క్రికెట్ కు చోటు లభించింది. ఆ తర్వాత మళ్లీ ఇన్నాళ్లకు 2028 ఒలింపిక్స్ లో క్రికెట్ కు చోటు కల్పించాలని ఐసీసీ భావిస్తోంది. ఆప్పుడు జరిగిన ఏకైక మ్యాచ్‌లో గ్రేట్ బ్రిటన్, ఫ్రాన్స్ జట్లు తలపడ్డాయి. ఇందులో గ్రేట్ బ్రిటన్ స్వర్ణం నెగ్గగా, ఫ్రాన్స్కు రజతం దక్కింది.
అయితే ఒలింపిక్స్‌లో క్రికెట్‌కు ప్రాతినిధ్యం కల్పించడం అదే చివరిసారి. విశ్వక్రీడల్లో ఆధిపత్యం చెలాయించే అమెరికా, రష్యా, చైనా, జర్మనీ, జపాన్ లాంటి దేశాలు క్రికెట్‌పై పెద్దగా ఆసక్తి చూపకపోవడంతో జెంటిల్మెన్ గేమ్‌ను విశ్వక్రీడల నుంచి తొలగించారు.
ఈ విషయంపై భారత క్రికెట్ నియంత్రణ మండలి( బీసీసీఐ) క్రికెట్ అభిమానులకు శుభవార్త చెప్పింది. ఒలింపిక్స్ లో క్రికెట్ ను ఎప్పుడు చేర్చినా తాము సిద్ధమేనంటూ బీసీసీఐ సెక్రటరీ జై షా వెల్లడించారు. ఒలింపిక్స్ లో క్రికెట్‌ను భాగం చేసేందుకు ఐసీసీతో కలిసి బీసీసీఐ ప్రయత్నాలు ముమ్మరం చేస్తుందని తెలిపారు.
కాగా, ఒలింపిక్స్‌లో క్రికెట్ ను చేర్చాలని గతంలోనే అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం(ఐఓసీ)తో ఐసీసీ చర్చలు జరిపింది. అయితే, అప్పుడు బీసీసీఐ అందుకు సుముఖత వ్యక్తం చేయలేదు. దీంతో ఆ ప్రయత్నాలు అర్ధంతరంగా ముగిశాయి. కానీ, ప్రస్తుతం బీసీసీఐ సానుకూలంగా స్పందించడంతో ఆ దిశగా అడుగులు పడుతున్నాయి. అన్నీ సజావుగా సాగితే.. 2028 లాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్ లో ఐసీసీ ఎనిమిది జట్లను బరిలో దించే అవకాశముంది. బీసీసీఐ, భారత పురుష, మహిళల జట్లను బరిలోకి దించనున్నట్లు తెలుస్తోంది. ఇక ఫార్మాట్ విషయానికొస్తే.. టీ20 లేదా టీ10 తరహాలో అతి చిన్న ఫార్మాట్ వైపు మొగ్గు చూపే ఆస్కారం ఉంది.