బీసీసీఐ ఫేస్బుక్ , ట్విట్టర్ కవర్ పేజీల్లో ధోని ఫోటో ..ఎందుకంటే !

Update: 2020-10-28 17:10 GMT
మహేంద్ర సింగ్ ధోని...భారత క్రికెట్ జట్టులో కీలకమైన ఆటగాడిగా ఓ వెలుగు వెలిగిన ఆటగాడు. తన ధనా ధన్ షాట్లతో పాటు ఎవరికి అందని ఎత్తుగడలతో ఓ వైపు బ్యాట్ మెన్‌గా, మరోవైపు సారథిగా టీంఇండియాకు అనేక మరుపురాని విజయాలు సాధించిపెట్టాడు. అయితే అతడు గత కొన్నాళ్లుగా ఫామ్ కోల్పోవడంతో తీవ్ర విమర్శలపాలయ్యాడు. ఓ సందర్భంలో ధోనిని జట్టులోంచి తొలగించాలన్న డిమాండ్ మరీ ఎక్కువయ్యింది. ఇలా గడ్డుకాలాన్ని ఎదుర్కొన్న ధోనీ మళ్లీ తన సత్తా చూపించాడు. అయితే , గత ఏడాది వన్డే వరల్డ్ కప్ మ్యాచ్ తర్వాత క్రికెట్ కి దూరమైనా ధోని మళ్లీ ఐపీఎల్ లో బ్యాట్ పట్టి అభిమానులని అలరిస్తున్నాడు. అయితే , ఐపీఎల్ ప్రారంభానికి ముందే అంతర్జాతీయ క్రికెట్ కి అనూహ్యంగా రిటైర్మెంట్ ప్రకటించి అందరిని విస్మయానికి గురిచేశారు. ధోని ఫ్యాన్స్ అయితే , ధోని రిటైర్మెంట్ ను ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు.

వాస్తవానికి 2019 వన్డే ప్రపంచకప్ తర్వాత ధోనీ రిటైర్మెంట్ ప్రకటించేస్తాడని అంతా ఊహించారు. కానీ.. ఆ టోర్నీ ముగిసిన తర్వాత ఆర్మీలో కొన్ని రోజులు పనిచేసిన ధోనీ.. ఆ తర్వాత టీమిండియా సెలక్షన్‌కి దూరంగా ఉండిపోయాడు. దాంతో.. సెంట్రల్ కాంట్రాక్ట్‌ని బీసీసీఐ తప్పించగా.. భారత సెలక్టర్లు కూడా ధోనీ స్థానంలో రిషబ్ పంత్‌, కేఎల్ రాహుల్‌కి వరుస అవకాశాలిస్తూ వెళ్లారు. దాంతో.. ధోనీ కెరీర్ ఇక ముగిసిపోయిందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కానీ.. అప్పట్లో మౌనంగా ఉండిపోయిన ధోనీ.. అందరికీ షాకిస్తూ ఇంటర్నేషనల్ క్రికెట్‌కి వీడ్కోలు చెప్పేశాడు. భారత్ జట్టులోకి 2004లో అరంగేట్రం చేసిన ధోనీ.. 90 టెస్టులు, 350 వన్డేలు, 98 టీ20 మ్యాచ్‌లాడాడు. . కెప్టెన్‌గానూ 2007‌లో టీ20 ప్రపంచకప్, 2011లో వన్డే ప్రపంచకప్, 2013లో ఛాంపియన్స్ ట్రోఫీ గెలవడం ద్వారా.. ఈ మూడు ఐసీసీ టోర్నీలు గెలిచిన ఏకైక కెప్టెన్‌గా చరిత్రలో నిలిచిపోయాడు.

ఇదిలా ఉంటే , తాజాగా బీసీసీఐ ఆస్ట్రేలియా పర్యటన కోసం టీం ను ప్రకటించింది. యూఏఈ వేదికగా ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ 2020 పూర్తికాగానే , జట్టు సభ్యులు అటునుండి ఆస్ట్రేలియా వెళ్లనున్నారు. అయితే , చాలా ఏళ్ల తర్వాత ధోని లేకుండా ఇండియా జట్టు విదేశీ పర్యటనకి వెళ్తుంది. ఈ నేపథ్యంలో ధోని టీం కి చేసిన సేవలని గుర్తు చేసుకుంటూ అధికారిక పేస్ బుక్ , ట్విట్టర్ కవర్ పేజీల ఫోటోను మార్చింది. #thankyoumadhoni అంటూ ధోని ఫోటో పెట్టి ఇన్నేళ్లు ధోని చేసిన సేవలకు ధన్యవాదాలు తెలిపింది.
Tags:    

Similar News