వేసవి వచ్చిందంటే చాలు మందుబాబులంతా బీరు బాట పడుతుంటారు. వైన్ షాపులు - బార్లలో బీర్ల అమ్మకాలు జోరందుకుంటాయి. కానీ ఇంతకుముందెన్నడూ లేనట్లుగా ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు సీన్ రివర్స్ అయిందట. ఎండలు మండిపోతున్నా కూడా లెక్క చేయకుండా మందుబాబులు లిక్కర్ కే మొగ్గు చూపుతున్నారట.
గతేడాదితో పోలిస్తే ఈ మేలో బీర్లు అమ్మకాలు తగ్గడమే అందుకు సాక్ష్యం. మరోవైపు లిక్కర్ అమ్మకాలు మాత్రం పది శాతం పెరిగాయి. మార్చి వరకు బీర్ల అమ్మకాలు ఓ రేంజ్ లో ఉండగా వేసవి వేడి పెరిగిన కొద్దీ లిక్కర్ అమ్మకాలు ఊపందుకుని బీర్ల అమ్మకాలు ఒక్కసారిగా పడిపోయాయి.
గతేడాది మే 12 వరకు 9.14 లక్షల కేసుల బీర్లు అమ్ముడుపోగా, ఈ ఏడాది ఇప్పటి వరకు 8.78 లక్షల కేసులు మాత్రమే అమ్ముడయ్యాయి. అంటే 3.90 శాతం అమ్మకాలు పడిపోయాయి. గతేడాది మేలో 9.95 లక్షల కేసుల లిక్కర్ విక్రయాలు నమోదు కాగా, ఈ ఏడాది ఇప్పటి వరకు 11.03 లక్షల కేసుల లిక్కర్ అమ్ముడుపోయి 10.84 శాతం వృద్ధి నమోదైంది.
అయితే... బీర్లకు డిమాండ్ ఎంత తగ్గితే అంత మంచిదని ఎక్సైజ్ శాఖ అధికారులు చెబుతున్నారు. రాష్ట్రంలో నెలకు 25 లక్షల కేసుల బీర్లకు డిమాండ్ ఉండగా, ఉత్పత్తి మాత్రం 10 లక్షల కేసులే కాబట్టి ఇదీ ఒకందుకు మంచిదేనని అంటున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/