దీదీకి గట్టి షాకిచ్చిన బెంగాల్ ప్రజలు

Update: 2019-05-23 08:58 GMT
అనుకున్నదే జరిగింది. బీజేపీ బెంగాల్ లోనూ ప్రతాపం చూపింది. బెంగాల్ సీఎం మమతా బెనర్జీతో సై అంటూ సై అని పోరాడిన బీజేపీ చివరకు ఫలితాల్లో అంతే ఫలితాలను సాధించింది.  బెంగాల్ లోక్ సభ ఎన్నికల్లో మమతా బెనర్జీకి బెంగాల్ ప్రజలు కూడా గట్టి షాక్ ఇచ్చారు.

బెంగాల్ రాష్ట్రంలో బీజేపీ  పోయిన సారి 2014లో రెండు లోక్ సభ సీట్లే సాధించింది. కానీ ఈసారి మాత్రం మొత్తం 42 లోక్ సభ నియోజకవర్గాలు ఉన్న రాష్ట్రంలో బీజేపీ 18 స్థానాల్లో ముందంజలో ఉండడం విశేషంగా మారింది. ఇక తృణమూల్ కాంగ్రెస్ భారీగా సీట్లను నష్టపోయింది.

గత 2014లో తృణమూల్ కాంగ్రెస్ బెంగాల్ లో 36 స్థానాలతో బలమైన పార్టీగా అవతరించింది. ఈసారి మాత్రం కేవలం 22 స్థానాల్లోనే ముందంజలో ఉండడం గమనార్హం.

జాతీయ చానెళ్లు, ఎగ్జిట్ పోల్స్ అంచనావేసిన విధంగా బీజేపీ బెంగాల్ లో సత్తా చాటడం విశేషం.


Tags:    

Similar News