మూడు నగరాలలో పట్టుబడిన ఉగ్రభూతాలు

Update: 2016-01-22 07:46 GMT
దేశంలో భారీ విధ్వంసానికి కుట్ర జరిగిందా? ఏకకాలంలో సీరియల్ బాంబుపేలుళ్లు లేదంటే.. విధ్వంసం సృష్టించాలన్న ప్లాన్ ఉందా? లాంటి సందేహాలు కలిగేలా శుక్రవారం పలు పరిణామాలు చోటు చేసుకున్నాయి. జనవరి 26న రిపబ్లిక్ డే సందర్భంగా దేశంలో కలకలం రేపేందుకు వీలుగా ఉగ్రభూతాలు పెద్ద ప్లాన్ వేసినట్లుగా కనిపిస్తోంది. ఉగ్రవాదుల కదలికలపై జాతీయ దర్యాప్తు సంస్థ చేస్తున్న హెచ్చరికలు నిజమయ్యాయి.

శుక్రవారం ఉదయం కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగళూరులో ఇద్దరు ఉగ్రవాదుల్ని ఎస్ ఐఏ అధికారులు అదుపులోకి తీసుకుంటే.. ఇది జరిగిన గంట వ్యవధిలోనే హైదరాబాద్ లోని అనుమానిత ప్రాంతాల్లో సోదాలు నిర్వహించి.. ఉగ్రవాదులుగా భావిస్తున్న నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. ఇక.. దేశ రాజధాని ఢిల్లీలోనూ అధికారులు భారీగా సోదాలు నిర్వహించి మరో ముగ్గురు ఉగ్రవాదుల్ని అరెస్ట్ చేయటం గమనార్హం.

ఒకటి తర్వాత ఒకటిగా చోటు చేసుకున్న పరిణామాలు..ఒకేరోజు కొద్ది గంటల వ్యవధిలో దాదాపు పదిమంది ఉగ్రవాదులు పట్టుబడటం ఇప్పుడు సంచలకం రేకెత్తిస్తోంది. తాజాగా పోలీసులు అదపులోకి తీసుకున్న ఉగ్రవాదులతో పెద్ద విధ్వంసానికి చెక్ పెట్టినట్లుగా భావిస్తున్నారు. మరోవైపు.. దేశంలోకి పెద్ద ఎత్తున ఉగ్రవాదులు అడుగుపెట్టినట్లుగా సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున సోదాలు నిర్వహిస్తున్నారు.
Tags:    

Similar News