ఇసుక-మట్టి..ఫిరాయింపుదారుల దోపిడీ కథ

Update: 2018-10-28 17:30 GMT
పాపం.. కాంగ్రెసోళ్లకు ఈ ఐడియా తట్టనే లేదు. అందుకే బంగారు బాతు లాంటి ఇసుక వ్యాపారాన్ని గుర్తించక వారు కోట్లు నష్టపోయారు. ఇదే విషయాన్ని అప్పట్లో ఓ టీవీ ఇంటర్వ్యూలో మాజీ మంత్రి శైలజానాథ్ టీడీపీ ఇసుక దోపిడీ గురించి సెటైర్ గా వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ హయాంలో అవినీతి జరిగింది కానీ.. ఇసుక నుంచి ఇంతలా దోచుకోవచ్చని ఏ కాంగ్రెస్ నేతకు తెలియదని ఆయన వ్యాఖ్యానించారు. దీన్ని బట్టి టీడీపీ ప్రభుత్వ ఇసుక దోపిడీ ని అంచనా వేయవచ్చన్నారు.

ఉమ్మడి ఏపీలో ఒకప్పటి టీడీపీ, ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఇసుక అనేది అందరికీ ఉచితంగా దక్కేది. గ్రామాలు,పట్టణాలు చుట్టుపక్కల ఉండే వాగులు - వంకల నుంచి ఇళ్లు నిర్మించుకునే వారు ట్రాక్టర్లు - లారీల ద్వారా తెచ్చుకొని ఇళ్లు కట్టుకునేవారు. దీనికి ఎటువంటి పన్నులు, రుసుములు ఉండేవి కావు. కానీ 2014లో అధికారంలోకి వచ్చిన టీడీపీ నేతల కక్కుర్తికి ఇసుక కూడా ఆర్థిక వనరైంది. గ్రామస్థులు - స్థానిక వ్యాపారులు ఇసుకను తీసుకెళ్లడానికి వీల్లేదని.. ఆంక్షలు - చెక్ పోస్టులు అడ్డుపుల్లలు సృష్టించారు. ప్రభుత్వ రీచులు ఏర్పాటు చేసి కావాల్సినంత కొల్లగొట్టి అమ్ముకుంటూ కోట్లకు పడగలెత్తారు. డైరెక్ట్ గా టీడీపీ నేతలే రంగంలోకి దిగి వ్యాపారం మొదలుపెట్టారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

ఈ ఇసుక వ్యాపారంలో గ్రామాల్లోని జన్మభూమి కమిటీలతో పాటు ఆయా నియోజకవర్గ ఎమ్మెల్యే స్థాయి నేతల హస్తం కూడా ఉందని ఆరోపణలున్నాయి. రాయలసీమలో జిల్లాల మంత్రులు - ఎమ్మెల్యేలు లారీలతో ఇసుకను బెంగళూరు తరలించి మరీ వ్యాపారాన్ని నిర్వహిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది.   ఇలా స్వేచ్ఛా వనరు అయిన ఇసుకను కూడా వ్యాపారంగా మార్చేసి కోట్లకు పడగలెత్తారు..
 
ఇసుక పని అయిపోయింది. ఇప్పుడు మట్టి దోపిడీ కథ మొదలైంది. కర్నూలు జిల్లాలో ఓ అధికారపార్టీ మంత్రి - ఎమ్మెల్యేల మధ్య మట్టి కోసం పెద్ద ఎత్తున రచ్చ జరుగుతోందట.. వీరిద్దరూ వైసీపీ నుంచి టీడీపీలోకి ఫిరాయించిన వారే..

కర్నూలు జిల్లాలో విశేషంగా ఉన్న ఇటుక బట్టీలకు ఎర్రమట్టి నిత్యావసరం. దీన్ని క్యాష్ చేసుకొని మంత్రి భూమా అఖిలప్రియ అనుచరులు .. పక్కనున్న శ్రీశైలం నియోజకవర్గం పరిధిలో ఎర్రమట్టిని తవ్వుకుంటూ అమ్ముకుంటున్నారట.. దీనిపై స్థానిక శ్రీశైలం ఎమ్మెల్యే  బుడ్డా రాజశేఖర్ రెడ్డి అభ్యంతరం తెలిపారట.  నా నియోజకవర్గంలో తాను మట్టిని అమ్ముకోవాలని కానీ.. మీరు ఎవరంటూ గొడవకు దిగినట్లు సమాచారం. ఇలా మంత్రి అఖిలప్రియ, బుడ్డా మధ్య మట్టి విషయంలో పెద్ద యుద్దమే నడుస్తోందట..

శోభా నాగిరెడ్డి బతుకున్న రోజుల్లో శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డిని అఖిలప్రియ మామయ్యగా పిలచేది. ఇప్పుడు మామా-కోడళ్ల మధ్య మట్టి వివాదమంటూ జిల్లాలో కథలు కథలుగా చెప్పుకుంటున్నారు. అఖిలప్రియ ఇదివరకే మరో మామ ఏవీ సుబ్బారెడ్డితోనూ  తగువులు పెట్టుకుంది. ఇలా మామలిద్దరితోనూ అఖిలప్రియ కయ్యానికి కాలుదువ్వడం హాట్ టాపిక్ గా మారింది.
Tags:    

Similar News