ఆంధ్రప్రదేశ్ టూరిజం శాఖ మంత్రి అఖిలప్రియకు పెళ్లి కుదిరిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది మే 12వ తేదీ శనివారం ఉదయం హైదరాబాద్ లోని మంత్రి ఇంట్లోనే భార్గవరామ్ తో నిశ్చితార్థం జరిగింది. రెండు కుటుంబాలు ఈ వేడుకను ఘనంగా నిర్వహించాయి. ఈ నిశ్చితార్థానికి ఎమ్మెల్యేలు ఎస్వీ మోహన్ రెడ్డి - బ్రహ్మానందరెడ్డి తదితరులు హాజరయ్యారు. ఏపీ మాజీ డీజీపీ సాంబశివరావు మాజీ అల్లుడు భార్గవ్. ఈ వేడుకకు సంబంధించి ఫొటోలు బయటకొచ్చిన తర్వాత రెండు నెలల గ్యాప్ అనంతరం వారి వివాహం జరుగుతోంది. వారి వివాహానికి సంబంధించి ఆహ్వాన పత్రిక చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఆగస్ట్ 29వ అఖిలప్రియ - భార్గవ్ వివాహం జరగనుంది. ఆళ్లగడ్డలోని భూమా శోభానాగిరెడ్డి ఇంజినీరింగ్ లో కాలేజీలో వీరి వివాహం జరగనుంది. వీరి రిసెప్షన్ కు హైదరాబాద్ వేదిక కానుంది. సెప్టెంబర్ 2వ తేదీన ఎన్ కన్వెన్షన్ లో జరిగే ఈ రిసెప్షన్ కు తెలుగు రాష్ర్టాలకు చెందిన ప్రముఖులు హాజరుకానున్నట్లు తెలుస్తోంది. రాజకీయ - సినీ - వ్యాపార ప్రముఖులు ఈ రిసెప్షన్ కు విచ్చేయనున్నారు. ఇప్పటికే తెలుగు రాష్ర్టాల గవర్నర్ సహా ఇరు రాష్ర్టాల ముఖ్యమంత్రులు - మంత్రులకు అఖిలప్రియ వివాహ పత్రికలు వ్యక్తిగతంగా అందజేశారు.
కాగా, ఏపీ పర్యాటకశాఖ మంత్రి భూమా అఖిలప్రియ తండ్రి నాగిరెడ్డి సీనియర్ నాయకుడు. ఆమె తల్లి శోభా నాగిరెడ్డి సైతం ప్రముఖ రాజకీయవేత్తగా గుర్తింపు పొందారు. కొద్దికాలం ఆయన గుండెపోటుతో చనిపోయారు. ఆ తర్వాత అఖిలప్రియ రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. మంత్రి కాకముందే అఖిల ప్రియకు వివాహం జరిగింది. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి బావమరిది రవీంద్రనాథ్ రెడ్డి బావమరిది కుమారుడితో వివాహం జరగగా పలు కారణాల వల్ల అది విడాకులకు దారితీసింది. మరోవైపు భార్గవ్ కు సైతం ఇది రెండో వివాహం. మాజీ డీజీపీ సాంబశివరావుకు కూతురును ఆయన వివాహం చేసుకున్నారు. అయితే పలు కారణాలతో వారి బంధం వీడిపోయింది.
అయితే తాజాగా వీరిద్దరు పెళ్లిపీటలు ఎక్కడానికి ముందు వీరికి పరిచయం ఉందని తెలుస్తోంది. అఖిలప్రియతో నిశ్చితార్థానికి ముందే భూమా కుటుంబంతో భార్గవ్‌కు అనుబంధం ఉందని సమాచారం. భూమా ట్రస్ట్ వ్యవవహారాలు - వారి కుటుంబపరమైన ఇతర అంశాలను భార్గవ్ చూసేవారని తెలుస్తోంది. ఈ సందర్భంగానే అఖిలప్రియకు భార్గవ్ కు పరిచయం ఏర్పడి సాన్నిహిత్యానికి దారితీసిందని అంటున్నారు. మొదటి నుంచి కుటుంబంతో కలిసి మెలసి ఉండటం, ఇటీవల తల్లిదండ్రులను కోల్పోయిన అఖిలప్రియ భార్గవ్ వివాహం చేసుకునేందుకు సిద్ధపడ్డారని సమాచారం.