ఎన్నికల కమిషన్ నిబంధనలు ఏమాత్రం పట్టించుకోకుండా నంద్యాల ఉప ఎన్నికల ప్రచారంలో టీడీపీ వ్యవహరించిన తీరుపై విమర్శలు వినిపిస్తూనే ఉన్నాయి. ఇదే సీన్ ఇప్పుడు కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల్లోనూ కనిపించబోతోందనే ఆరోపణలు కూడా పొలిటికల్ వర్గాల్లో గుప్పుమంటున్నాయి. నంద్యాల ఉప ఎన్నికల్లో ఓటరు తాను ఎవరికి ఓటేశాడో తెలుసుకునే వీవీ ప్యాట్లు ఉన్న ఓటింగ్ యంత్రాలను ఉపయోగించి.. కాకినాడలో మాత్రం మామూలు ఈవీఎంలను వినియోగించడంపై ప్రతిపక్ష నేతలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అధికార దుర్వినియోగంలో సీఎం చంద్రబాబును నమ్మలేమని.. ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసే అవకాశముందని ఈసీకి ఫిర్యాదు చేశారు.
అధికారం కోసం, ఎన్నికల్లో విజయం సాధించడం కోసం టక్కుటమార విద్యలన్నీ ప్రదర్శించగల నేర్పు సీఎం చంద్రబాబు సొంతమనే ఆరోపణలు లేకపోలేదు. ఈ నేపథ్యంలో కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలో వీవీ ప్యాట్లు ఉన్న ఈవీఎంలను మాత్రమే వినియోగించాలని ఎన్నికల సంఘాన్ని వైసీపీ కోరింది. సీఎం చంద్రబాబు నాయుడు ఎన్నికల వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నారని వైఎస్సార్ సీపీ నేతలు భూమన కరుణాకర్ రెడ్డి - ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆరోపించారు. ` పారదర్శకంగా ఎన్నికలు జరిపించాల్సిన బాధ్యత ఈసీపై ఉంది. వీవీ ప్యాట్లు లేకుండా జరిగే ఎన్నికలు నిష్పక్షపాతంగా జరుగుతాయన్న నమ్మకం మాకు లేదు` అని వీరు వివరించారు.
`గెలుపు కోసం ఎలాంటి అడ్డదారిలోనైనా వెళ్లే చంద్రబాబు.. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్(ఈవీఎం)లను ట్యాంపరింగ్ చేసి చూపించిన వి.హరిప్రసాద్ ను సలహాదారుగా నియమించుకున్నారని విమర్శించారు. ఆయనతో కలిసి కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. అధికార దుర్వినియోగంతో రాజకీయ లబ్ధిని పొందడంలో సిద్ధహస్తుడైన చంద్రబాబు ఈవీఎంలను ట్యాంపరింగ్ చేయడం లేదంటే నమ్మలేమని వివరించారు. అందుకే కేంద్ర ఎన్నికల సంఘం తక్షణమే జోక్యం చేసుకుని, కాకినాడలో వీవీ ప్యాట్లతో కూడిన ఈవీఎంలను మాత్రమే వాడేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు.