భూమా కుటుంబాన్ని అనాథ చేసింది నువ్వే కదా!!

Update: 2017-07-24 16:21 GMT
సీనియ‌ర్ ఎమ్మెల్యే భూమా నాగారెడ్డి కుటుంబం గురించి సానుభూతి వ్యాఖ్య‌లు చేసే నైతిక అర్హ‌త ఏపీ ముఖ్య‌మంత్రి - తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్ర‌బాబు నాయుడుకు లేద‌ని  వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నేత భూమ‌న క‌రుణాక‌ర్ రెడ్డి అన్నారు. భూమ‌న కుటుంబాన్ని ఒకప్పుడు రాజకీయ అనాథలుగా చేసింది చంద్రబాబేన‌ని ఆరోపించారు. సీఎం చంద్రబాబు విశృంఖల రాజకీయాలు చేస్తున్నారని పైగా దీనికి సెంటిమెంట్ రంగు పూస్తున్నార‌ని మండిప‌డ్డారు. క‌ర్నూలు జిల్లా నంద్యాలలోని వైఎస్సార్ సీపీ కార్యాలయంలో ఆయ‌న మీడియాతో మాట్లాడారు. అమరావతిని అభివృద్ధి నమూనాగా చెప్తున్న చంద్రబాబు కట్టింది.. మూడే మూడు బిల్డింగులని తెలిపారు. గతంలో తాము శిలాఫలకాలకు పూజలు చేశామ‌ని వివ‌రించారు. బాబు అవినీతిని తేల్చేందుకు కేంద్ర నిఘాసంస్థలు - సీబీఐ - ఇతర విభాగాలను ఎన్నికల కమిషన్ రంగంలోకి దించాలని డిమాండ్ చేశారు.

అధికారాన్ని కాపాడుకోడానికి దుష్ట నాటకాలు చేస్తున్న చంద్ర‌బాబు విశృంఖల రాజకీయాలకు పాల్ప‌డుతున్నార‌ని భూమ‌న క‌రుణాక‌ర్ రెడ్డి మండిప‌డ్డారు. దీన్ని నంద్యాలను వేదికగా చేసుకున్నారని ఆరోపించారు. తన హోదాను మరిచిపోయి... ఓటర్లను భయపెడుతున్నారని అన్నారు. అధికారయంత్రాంగాన్ని తనకోసం వాడుకుంటున్నార‌ని, ఎన్ని అక్రమాలు చేయడానికైనా వెనుకాడ‌టం లేదని అన్నారు. చంద్రబాబు రాజకీయం దుర్మార్గపు స్థాయికి చేరుకుందని అందుకే బ్లాక్ మెయిల్ రాజకీయాలు నడుపుతున్నాడని ఆరోపించారు. భూమా కుటుంబాన్ని ఒకప్పుడు రాజకీయ అనాథలుగా చేసింది చంద్రబాబేన‌ని...భూమా కుటుంబం రాజకీయ జీవితాలతో చంద్రబాబు ఒకప్పుడు ఆడకున్నార‌ని అన్నారు. అదే చంద్రబాబు ఇప్పుడు అనాథలకు ఓటేయమంటున్నార‌ని భూమ‌న తెలిపారు. అలాంటింది ఇవాళ మరోరకంగా మాట్లాడుతున్నాడని వివ‌రించారు. పదవుల ఇప్పిస్తానని ఫిరాయించేలా చేసి చివరకు భూమా చావుకు కారకుడయ్యార‌ని, ఈ ఉప ఎన్నిక అందుకే వచ్చిందని ఆరోపించారు.

అమరావతిని అభివృద్ధి నమూనాగా చెప్తున్న చంద్రబాబు కట్టింది.. మూడేమూడు బిల్డింగులని భూమ‌న తెలిపారు. అవికూడా చిన్న వర్షానికే కాకిపోతున్నాయని గుర్తు చేశారు. యాభైవేల ఎకరాల భూమూలు ఇప్పుడు ఎడారిగా ఉన్నాయని అందులో చంద్రబాబు తాబేదార్లు, అనుచరులు చేసుకున్న వ్యాపారం లక్షల కోట్లకు పైమాటేన‌ని ఆరోపించారు. విశాఖను ఎనలేనంతగా అభివృద్ధిచేశానని చంద్రబాబు చెప్తున్నారని అయితే చంద్రబాబు కుమారుడు సహా అక్కడి నాయకులు లక్షల ఎకరాలు దోచుకున్నారని అన్నారు. అక్కడ ప్రజల ముందు చంద్రబాబు ఇలాంటి మాటలు చెప్తే ప్రజలు ఏం చేస్తారో.. అది చేస్తారని న‌ర్మ‌గ‌ర్భ వ్యాఖ్య‌లు చేశారు. 800 కోట్ల రూపాయలకుపైగా కుంభకోణానికి కేశవరెడ్డి పాల్పడ్డార‌ని ఆయ‌న వియ్యంకుడు, వైఎస్సార్ సీపీకి ద్రోహం చేసిన వ్యక్తితో భయోత్పాలకు చంద్రబాబు దిగుతున్నార‌ని ఆరోపించారు. భారీ స్థాయిలో బెదిరింపులు, ప్రలోభాలకు దిగుతున్నార‌ని మండిప‌డ్డారు.

సర్పంచులు,  ఎంపీపీలు, కౌన్సిలర్లు చేయాల్సిన పనులను చంద్రబాబు చేస్తున్నార‌ని భూమ‌న ఎద్దేవా చేశారు. అవసరమైతే.. ఎంతటి స్థాయికైనా చంద్రబాబు దిగజారగలర‌ని ఆరోపించారు. చంద్రబాబు ఉడత బెదిరింపులకు ఎవ్వరూ లొంగరని తెలిపారు. మైనార్టీలు, పేదల్లో వెలుగులు నింపిన వ్యక్తి వైఎస్ఆర్ అని తెలిపారు. మైనార్టీలకు రిజర్వేషన్లు ఇచ్చిన ఏకైక వ్యక్తి వైఎస్ఆర్ అని ఆ సిద్ధాంతాలకు జగన్ కట్టుబడి పనిచేస్తున్నారని భూమ‌న తెలిపారు. తమిళనాడులో ఆర్కేనగర్ ఉప ఎన్నిక సందర్భంగా వెలుగుచూసిన వ్యవహారాలు ఇక్కడ కనిపిస్తున్నాయని భూమ‌న ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. అక్కడకు మించి ఇక్కడ ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నారని తెలిపారు. కేంద్ర నిఘాసంస్థలు, సీబీఐ, ఇతర విభాగాలను ఎన్నికల కమిషన్ రంగంలోకి దించాలని కోరారు. చంద్రబాబు చేస్తున్న దుర్మార్గాలను అడ్డుకోవాలని కోరారు. మూడేళ్లుగా అవినీతి సంపాదనను ఇక్కడ వెదజల్లాలని చూస్తున్నారని మండిప‌డ్డారు.
Tags:    

Similar News