దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మృతిపై వైసీపీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్ రెడ్డి మరోమారు సంచలన వ్యాఖ్యలు చేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డిది హత్యేనన్న అనుమానాన్ని భూమన మరోసారి లేవనెత్తారు. గతంలో గ్వాటిమాలా - పనామా దేశాల అధ్యక్షులు తమ దేశంలోని సహజ వనరులు తమ దేశానికే చెందాలని డిమాండ్ చేశారని, ఆ తరువాత వారిద్దరూ హెలికాఫ్టర్ ప్రమాదంలో మరణించారని భూమన పేర్కొన్నారు. అలాగే వైఎస్ కూడా ఏపీలోని సహజ వనరులు - గ్యాస్ నిక్షేపాలు ఎపి ప్రజలకే వినియోగించాలని డిమాండ్ చేసిన కొద్దిరోజులకే హెలికాఫ్టర్ ప్రమాదంలో మరణించారని గుర్తుచేశారు.
తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో జరిగిన నియోజకవర్గ వైసీపీ ప్లీనరీ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న భూమన ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్వాటిమాలా - పనామా దేశాల అధ్యక్షులు హత్యకు గురయ్యారని ఆ తరువాత జరిగిన దర్యాప్తులో తేలిందని ఆయన వెల్లడించారు. ఈనేపథ్యంలో వైఎస్ మరణం ఇప్పటికీ మిస్టరీయేనని ఆయన అనుమానం వ్యక్తంచేశారు. వైఎస్ మరణం వార్తను తట్టుకోలేక మరణించిన ప్రజలను ఓదార్చడానికి ఆయన కుమారుడు వైఎస్ జగన్ చేపట్టిన ఓదార్పుయాత్రను కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ అడ్డుకున్నా, ధిక్కరించి చేపట్టారని భూమన గుర్తు చేశారు. జగన్ ప్రజాభిమానాన్ని చూసి ఓర్వలేక సోనియాగాంధీ - చంద్రబాబునాయుడు కుట్రపన్ని అవినీతి కేసుల్లో జగన్ ను ఏడాదిన్నర పాటు జైలుకు పంపారని ఆరోపించారు. ప్రజాకంటక తెలుగుదేశం పార్టీని తరిమికొట్టేందుకు జనం సిద్ధంగా ఉన్నారని భూమన అన్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/