గూగుల్ ,ఆపిల్ మధ్య భారీ డీల్ .. విలువ ఎన్ని కోట్లంటే ?

Update: 2021-08-28 10:30 GMT
గూగుల్ .. ఈ గూగుల్ పేరు తెలియని వారు ఈ ప్రపంచంలో చాలా తక్కువ మంది మాత్రమే ఉంటారు. ఏవో కొన్ని దేశాల్లో తప్ప , దాదాపుగా చాలా దేశాల్లో గూగుల్ దే మొదటిస్థానం. ప్రపంచ వ్యాప్తంగా ఎన్ని రకాల బ్రౌజర్లు ఉన్నప్పటికీ , మనం కొనుగోలు చేసే మొబైల్ ఫోన్స్ లో మాత్రం గూగుల్ బ్రౌజర్ మాత్రమే ఉంటుంది. ఏదేదో ఆ మొబైల్ కంపెనీ ఫ్రీ గా ఇవ్వదు. ఇందుకోసం కొన్ని కోట్ల విలువైన ఒప్పందాలు కుదుర్చుకుంటుంది గూగుల్‌. తాజాగా ఈ ఇంటర్నెట్‌ బ్రౌజింగ్‌ దిగ్గజం, యాపిల్‌ తో ఈ ఏడాది కోసం లక్షా పదివేల కోట్లతో ఒప్పందం చేసుకుంది.

2021లో తయారైన ఐఫోన్‌, ఐప్యాడ్‌, మాక్‌ లలో గూగుల్‌ సెర్చ్‌ ఇంజిన్‌ కోసం 15 బిలియన్ల డాలర్ల (లక్షా పదివేల కోట్లకు పైనే) ఒప్పందం చేసుకుంది గూగుల్‌. దీనిద్వారా సఫారీ బ్రౌజర్‌ లో గూగుల్‌ సెర్చ్‌ ఇంజిన్‌ గా పని చేయనుంది. మైక్రోసాఫ్ట్‌-బింగ్‌ పోటీని తట్టుకునేందుకు ప్రతీ ఏడాది ఇలా భారీ ఒప్పందాలు చేసుకుంటూ పోతోంది గూగుల్‌. కిందటి ఏడాది ఈ ఒప్పందం విలువ పది బిలియన్ల డాలర్లు ఉండగా, 2019లో 8 బిలియన్‌ డాలర్లుగా ఉండేది.

ఇక వచ్చే ఏడాది ఈ విలువ మరింత పెరిగే అవకాశం ఉండొచ్చని (18-20 బిలియన్‌ డాలర్ల మధ్య) అంచనా వేస్తున్నారు టెక్‌ నిపుణులు. అయితే , ఇక ఐవోస్‌ డివైజ్‌ లపై యాపిల్‌-గూగుల్‌ డీల్‌ గతంలో తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. విస్తరణకు మిగతా బ్రౌజింగ్‌ ప్లాట్‌ ఫామ్స్‌ కు అవకాశం ఇవ్వాలంటూ యూకే కాంపిటీషన్‌ అండ్‌ మార్కెట్‌ అథారిటీ అభిప్రాయపడింది. కాగా భారత మార్కెట్‌పై గూగుల్‌ ప్రత్యేక దృష్టిసారించింది. వచ్చే 5-7 ఏళ్లలో ఇండియాలో 1,000 కోట్ల డాలర్లు (రూ.75,000 కోట్లు) పెట్టుబడులు పెట్టనున్నట్లు గూగుల్‌ సీఈఓ సుందర్‌ పిచాయ్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈక్విటీ వాటాల కొనుగోళ్లతో పాటు పలు మార్గాల్లో ఇన్వెస్ట్‌ చేయనున్నట్లు పిచాయ్‌ గత ఏడాది వెల్లడించిన సంగతి తెలిసిందే.
Tags:    

Similar News