ప్రపంచంతో పాటు రష్యాలో కూడా వైరస్ కల్లోలం సృష్టిస్తోంది. ఆ వైరస్ నియంత్రణకు పటిష్ట చర్యలు తీసుకుంటుండగా ఆ దేశాన్ని మరో విషయంలో కలకలం రేపుతోంది. దేశానికి మరో ఉత్పాతం ఆందోళన రేపుతోంది. రక్తాన్ని పీల్చేసే కీటకాలు ప్రబలి ప్రజలు తీవ్ర భయభ్రాంతులకు గురవుతున్న పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆ పురుగులే కిట్స్. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో రక్తాన్ని పీల్చే టిక్స్ కీటకాల బారిన ప్రజలు పడుతున్నారు. వీటి బారినపడ్డ వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుండడంతో ఆందోళన రేపుతోంది. కిట్స్ కీటకాల బారిన పడినవారంతా ప్రస్తుతం ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
చిన్న పరిమాణంలో ఉన్న ఈ కీటకం ఆ దేశాన్ని కలవరపెడుతోంది. ఈ కీటకాలు కుట్టిన వారికి ఇవ్వాల్సిన వ్యాక్సిన్లు కావాల్సినంత అందుబాటులో లేవు. దీంతో పరిస్థితి అదుపు తప్పుతోంది. వ్యాక్సిన్లు లేకపోవడంతో ఆస్పత్రుల్లో వైద్యులు చేతులెత్తేస్తున్నారట. ప్రస్తుతం ఆస్పత్రుల్లో తాత్కాలిక ఉపశమనానికి మాత్రమే వైద్యం అందిస్తున్నారు. దీంతో ప్రజలు వైరస్‌తో పాటు ఈ కీటకాలతో భయాందోళన చెందుతున్నారు.
సైబీరియాలోని అనేక ప్రాంతాలలో కనిపించే ఈ కిట్స్ కీటకాలు చిన్నచిన్నగా ఉండే గడ్డిలో నివసిస్తుంటాయి. ఇవి ప్రజలపై దాడి చేసి రక్తాన్ని పీల్చుతాయి. ప్రస్తుతం ఆ కీటకాల ఉధృతి పెరుగుతుండడంతో ఆందోళన చెందుతున్నారు. రష్యాలోని సైబీరియాతో సహా పలు ప్రాంతాల్లో ప్రస్తుతం ఆ పురుగుల సంఖ్య ఎక్కుగా ఉంది. క్రాస్నోయార్‌స్క్ అనే ప్రాంతంలోనే దాదాపు 8,215 మందికి పైగా ప్రజలకు పురుగులు కుట్టాయి. వీరిలో 2,125 మంది చిన్నారులు ఉన్నారు.
సాధారణంగా ఆ పురుగులు ఒక చదరపు కిలోమీటర్‌కు 0.5 చొప్పున ఉండేవి. కానీ వాటి సంఖ్య 214కు పెరిగింది. ఇదే ఆందోళన కలిగిస్తోంది. ఈ కిట్స్ కీటకాల భయంతో రష్యావాసులు భయాందోళనలకు గురవుతున్నారు. పురుగుల సంఖ్య ఇప్పుడు ఏకంగా 428 రెట్లు పెరగడంతో తీవ్రమైన అనారోగ్య సమస్యలు వస్తున్నాయని ప్రజలు బెంబేలెత్తుతుండగా ప్రభుత్వం నివారణ చర్యలు ముమ్మరం చేసింది. మహమ్మారి వైరస్‌కు తోడు ఈ కీటకాల దాడితో ప్రస్తుతం రష్యా తీవ్రంగా సతమతమవుతోంది.