క్లాస్‌రూమ్‌లలో హిజాబ్ ధరించకుండా నిషేధం విధించిన కర్ణాటకలోని కాలేజీ విద్యార్థులకు మద్దతుగా కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా బుధవారం మాట్లాడారు. ఎలాంటి దుస్తులు ధరించాలనే ఎంపిక మహిళలదేనని, ఈ హక్కు రాజ్యాంగం ద్వారా వచ్చిందని ప్రియాంకగాంధీ ట్వీట్ చేశారు.
"బికినీ అయినా, ఘూంఘాట్ అయినా, జీన్స్ అయినా, లేదా హిజాబ్ అయినా, తాము ఏమి ధరించాలో నిర్ణయించుకోవడం ఒక మహిళ యొక్క హక్కు. ఈ హక్కు భారత రాజ్యాంగం ద్వారా ప్రజలకు ఇవ్వబడింది. మహిళలను వేధించడం ఆపండి" అని ప్రియాంక గాంధీ వాద్రా ట్వీట్ చేశారు. #ladkihoonladsaktihoon హ్యాష్‌ట్యాగ్ ను జతచేసి సోషల్ మీడియాలో ట్రెండ్ సెట్ చేశారు.
ఈ ట్వీట్ కు అన్నయ్య కూడా మద్దతుగా నిలిచారు. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తన సోదరి ట్వీట్‌పై 'థంబ్స్-అప్' ఎమోజీతో స్పందించారు. డిసెంబర్‌లో ఉడిపి కాలేజీలో ఆరుగురు విద్యార్థులు క్లాస్‌లో ఉన్నప్పుడు హిజాబ్ ధరించకుండా అడ్డుకున్నారని ఆరోపించడంతో వివాదం చెలరేగింది. వారి నిరసనలకు బీజేపీ మద్దతుదారులు కాషాయ కండువాలు కప్పి, 'జై శ్రీరామ్' అని కేకలు వేస్తూ విద్యార్థులు.. దీనికి పోటీగా మరో వర్గం నేతృత్వంలో ఆందోళనలు కొనసాగాయి.
నిరసనలు దక్షిణాది రాష్ట్రం కర్ణాటకలో మొదలై ఇప్పుడు ఇతర రాష్ట్రాలకు పాకాయి. ఈ ఆందోళన మతపరమైన వ్యక్తీకరణలతో రాజకీయ రంగును పులుముకుంది. ఇలాంటి సంఘటనలు మధ్యప్రదేశ్ మరియు పుదుచ్చేరిలో కూడా నమోదయ్యాయి.
హిజాబ్‌లు ధరించడంపై ఉన్న ఆంక్షలను ప్రశ్నిస్తూ ఐదుగురు మహిళలు వేసిన పిటిషన్‌పై హైకోర్టు నిర్ణయం కోసం వేచి ఉన్న కర్ణాటక బీజేపీ ప్రభుత్వం ఈ విషయంలో చాలా వరకు మౌనంగా ఉంది. ఆ కాలేజీలకు సెలవులు కూడా ఇచ్చింది. దీనిపై నిన్న విచారణ ప్రారంభించిన ధర్మాసనం ఈ మధ్యాహ్నం మళ్లీ వాదనలు ప్రారంభించనుంది.
అన్ని పాఠశాలలు మరియు కళాశాలలను మూడు రోజుల పాటు మూసివేయాలని ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై నిన్న ఆదేశించారు. ఈ క్రమంలోనే హైకోర్టు తీర్పు తర్వాతే దీనికి పరిష్కారం లభించనుంది.