ప్రపంచ అపర కుబేరుడిగా మరోసారి బిల్‌ గేట్స్‌!

Update: 2019-10-25 09:07 GMT
మైక్రోసాఫ్ట్‌ సహ వ్యవస్థాపకుడు బిల్‌ గేట్స్‌ మరోసారి ప్రపంచ అపార కుబేరునిగా మారారు.  1987లో ప్రపంచ సంపన్నుడిగా ఫోర్బ్‌ జాబితాలో తొలిసారిగా స్థానం దక్కించుకున్న బిల్‌ గేట్స్‌ ..ఆ తరువాత వార్సుగా  24 ఏళ్ల పాటు అదే స్థానంలో కొనసాగిన విషయం తెలిసిందే. కానీ , ఆ తరువాత అమెజాన్‌ షేర్లు భారీగా ఎగిసిన నేపథ్యంలో 2018లో తొలిసారిగా బిల్‌ గేట్స్‌ ను వెనక్కినెట్టి 169 బిలియన్‌ డాలర్ల సంపదతో ప్రపంచ కుబేరుడిగా బెజోస్‌ అవతరించారు.

కానీ , తాజాగా మెజాన్‌ షేర్లు పతనమైన నేపథ్యంలో కంపెనీ సీఈవో జెఫ్‌ బెజోస్‌ మొదటిస్థానాన్ని కోల్పోయారు. మూడో త్రైమాసిక ఫలితాల్లో అమెజాన్‌ భారీ నష్టాలు చవిచూడటం.. అదే విధంగా గురువారం నాటి ట్రేడింగ్‌ లో కంపెనీ షేర్లు ఏడు శాతం మేర పడిపోవడంతో... 2017 తర్వాత తొలిసారిగా కంపెనీ నికర ఆదాయంలో 26 శాతం తగ్గుదల కనిపించింది.

ఇక తాజా నివేదికల ప్రకారం బెజోస్‌ ఆస్తి 103.9 బిలియన్‌ డాలర్లుగా ఉండగా.. బిల్‌ గేట్స్‌ ప్రస్తుతం 105.7 బిలియన్‌ డాలర్ల సంపద కలిగి ఉన్నారు. అయితే ప్రస్తుతం అమెజాన్‌ షేర్లు పతనం కావడంతో పాటుగా  - తన  భార్య మెకాంజీకి భరణం రూపంలో దాదాపు 36 బిలియన్‌ డాలర్ల విలువ గల షేర్లు ఇవ్వడంతో  బెజోస్‌ రెండో స్థానానికి పడిపోయినట్లు తెలుస్తుంది.


Tags:    

Similar News