టీఆర్ఎస్ రెబల్ కాదు.. బీజేపీ నేతే సాగర్ బరిలో..

Update: 2021-03-30 03:36 GMT
నాగార్జునసాగర్ బరిలో చివరివరకు అభ్యర్థిని ప్రకటించకుండా టీఆర్ఎస్, బీజేపీలు దోబూచులాడాయి. భారీ పోటీ ఉన్న టీఆర్ఎస్ లో అభ్యర్థిని ప్రకటించాక.. ఎవరైతే అసంతృప్తితో అసమ్మతి రాజేస్తారో.. అందులోంచి బలమైన నేతను ఎంపిక చేద్దామని ఇన్నాళ్లు ఆగిందన్న గుసగుసలు వినిపించాయి.

కానీ ఇప్పుడు ప్రయోగాలు చేయకుండా  ఓ విద్యావంతుడైన డాక్టర్ కు పట్టం కట్టారు.  గత ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీచేసిన నేతకు ఈసారి టికెట్ ఇవ్వలేదు..

నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా డాక్టర్ రవికుమార్ ను ఎంపిక చేశారు. ఈ మేరకు బీజేపీ అధిష్టానం ప్రకటించింది. జనరల్ కేటగిరిలో ఎస్టీ అయిన రవికుమార్ కు సీటు కేటాయించారు.

పలు ఆస్పత్రుల్లో సివిల్ సర్జన్ గా రవికుమార్ పనిచేశారు. ఆయన ఎంతో సేవ చేశారు. ఈ క్రమంలోనే బీజేపీ అధిష్టానం ఈ డాక్టర్ కు టికెట్ కేటాయించింది. రవికుమార్ బుధవారం నామినేషన్ దాఖలు చేస్తారు.

కాంగ్రెస్ అభ్యర్థిగా జానారెడ్డి, టీఆర్ఎస్ నుంచి నోముల తనయుడు భగత్ అభ్యర్థులుగా బరిలోకి దిగుతున్నారు. బీజేపీ అభ్యర్థిని కూడా ప్రకటించడంతో ఉప ఎన్నికల వేడి రాజుకుంది. ఏప్రిల్ 17న నాగార్జున సాగర్ ఉప ఎన్నిక జరగనుంది.
Tags:    

Similar News