ట్యాబుల‌పై బీజేపీ వాద‌న రివ‌ర్స్ అయ్యిందే!

Update: 2022-12-24 06:39 GMT
ఏపీ ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా చేప‌ట్టిన ట్యాబ్‌ల పంపిణీని బీజేపీ విమ‌ర్శించింది. ఇది కేంద్ర ప్ర‌భుత్వ స‌హ‌కార స‌మాఖ్య  లో భాగంగా రాష్ట్రాలకు చేస్తున్న సాయంగా బీజేపీ ఏపీ చీఫ్ సోము వీర్రాజు చెప్పుకొచ్చా రు. అంతేకాదు.. దీనిలో ఏపీ గొప్ప‌త‌నం కూడా ఏమీలేద‌న్నారు. అయితే.. అస‌లు విష‌యాన్ని చూస్తే.. రాష్ట్రంలో 8వ త‌ర‌గ‌తి చ‌దువుతున్న విద్యార్థుల‌కు సుమారు 5.18 ల‌క్ష‌ల మందికి ప్ర‌భుత్వం ట్యాబులు ఇచ్చింది.

దీనికి గాను సుమారు 688 కోట్ల రూపాయ‌ల‌ను ఖ‌ర్చు చేసిన‌ట్టు చెప్పింది. అయితే.. దీనిని అమ్మ ఒడి ప‌థ‌కం కింద నిధులు వ‌ద్ద‌ని అనుకున్న‌వారిని మాత్ర‌మే ఎంపిక చేసింది. స‌రే.. ఈ ట్యాబుల్లో కుంభ కోణం జ‌రిగింద‌ని టీడీపీ నేత‌లు ఆరోపించారు. త‌క్కువ ధ‌ర‌ల‌కు వ‌చ్చే వాటిని ఎక్కువ పెట్టి కొన్నార‌ని.. ఆ పార్టీ నాయ‌కుడు ప‌ట్టాభి విమ‌ర్శించారు.ఈ విష‌యం ప‌క్క‌న పెడితే.. సోము మాత్రం ప‌థ‌కాన్ని హైజాక్ చేశారు.

ఈ ప‌థ‌కం.. కేంద్రం అమ‌లు చేస్తున్న శిక్షాఅభియాన్ కింద ఇచ్చిన‌వేన‌ని చెప్పుకొచ్చారు. దీనిని కాద‌ని వైసీపీ నేత‌లు కూడా కౌంట‌ర్ ఇవ్వ‌లేదు. అయితే.. ఇక్క‌డ మ‌రో విష‌యం ఏంటంటే.. 788 కోట్లు ఖ‌ర్చు చేసి.. ప్ర‌భుత్వం బైజూస్ ఎడ్ టెక్ సంస్థ‌తో ఒప్పందం చేసుకుంది. వ‌చ్చే మూడేళ్ల‌పాటు వీరు.. విద్యార్థుల‌కు పాఠ్యాంశాల కంటెంటును అందించాలి. మ‌రి దీనిని కేంద్రం ఎందుకు ఇవ్వ‌లేదు? అనేది ప్ర‌శ్న‌.

కేంద్రం ఇచ్చి ఉంటే.. ఇంత ఖ‌ర్చు ప్ర‌భుత్వానికి సేవ్ అయి ఉండేది క‌దా! అంటున్నారు ప‌రిశీల‌కులు. కేంద్రం నిజానికి స‌మాఖ్య స్ఫూర్తిని ప్ర‌ద‌ర్శించిందా? అనేది ప్ర‌శ్న‌. ఏదేమైనా సోము చేసిన వ్యాఖ్య‌ల్లో అంత‌రార్థ ఎలా ఉన్న‌ప్ప‌టికీ.. పార్టీకి మాత్రం ఇది మేలు చేయ‌లేద‌నే టాక్ వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News