ఉప ఎన్నికకు నగారా మోగిన నేపథ్యంలో.. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని మునుగోడులో కీలకమైన మూడు పార్టీలు.. బీజేపీ, కాంగ్రెస్, టీఆర్ ఎస్‌ల ప్రచార హోరు పదునెక్కనుంది. పోలింగ్ తేదీకి నెలరోజులు మాత్రమే సమయం ఉండడంతో ప్రధాన పార్టీలన్నీ అక్కడే మోహరించనున్నాయి. ప్రతి పార్టీకీ ఈ ఎన్నికలో గెలుపు ప్రతిష్ఠాత్మకంగా మారడంతో.. అర్థ, అంగబలాలతోపాటు శక్తియుక్తులన్నింటినీ ప్రయోగించేందుకు సిద్ధమవుతున్నాయి.
అంతేకాదు.. ఈ ఉప పోరే.. అధికారపార్టీకి రెఫరెండంగా మారుతుందని.. కాంగ్రెస్, బీజేపీలు ప్రకటిస్తు న్నాయి. దీంతో ప్రతి పార్టీ కూడా .. ఈ పోరును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. నియోజకవర్గంలో బహిరంగసభలను ఏర్పాటుచేయాలని టీఆర్‌ఎస్, బీజేపీ ఇప్పటికే నిర్ణయించాయి. టీఆర్‌ఎస్ బహిరంగసభలో కేసీఆర్.. బీజేపీ సభలో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా పాల్గొనే అవకాశాలున్నాయని సమాచారం. సమయం తక్కువగా ఉండడంతో ఓటర్లకు తమ ప్రధాన అజెండా.. ప్రధాన నినాదాలు ఏమిటన్న అంశంపైనా పోటీలో ఉన్న పార్టీలు స్పష్టత ఇవ్వనున్నాయి.
టీఆర్‌ఎస్ ప్రధానంగా సంక్షేమం, అభివృద్ధిపైనే దృష్టిపెట్టింది. ఇప్పటి వరకూ తాము చేసిన సంక్షేమం, అభివృద్ధి గురించి ప్రజలకు చెప్పి.. ఇకపైనా అది కొనసాగాలంటే తమకే మద్దతివ్వాలని ప్రజలను ఆ పార్టీ అడగనుంది. రైతు బంధు, దళితబంధు, ఫించన్లు తదితర సంక్షే మ పథకాలతో పాటు.. ఫ్లోరైడ్ సమస్య లేకుండా తాగునీరు అందించామని, నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులు చేపట్టామని ప్రజల దృష్టికి తేవాలని నిర్ణయించింది.
రెబల్స్ సహా చితక పార్టీల బెడద!అయితే.. మునుగోడులో మూడు ప్రధాన పార్టీలకు చిన్న పార్టీల బెడద పీడిస్తోంది. ఇతర చిన్న పార్టీలు, సంఘాల తరఫున కూడా ఈ నియోజకవర్గంలో అభ్యర్థులు బరిలోకి దిగనున్నారు. బీఎస్పీ రాష్ట్ర శాఖ అధినేత ప్రవీణ్‌కుమార్.. బీసీ, ఎస్సీ, ఎస్టీలకు ప్రాతినిధ్యం వహించేలా తాము ఒక అభ్యర్థిని పార్టీ తరఫున రంగంలోకి దించుతామని ప్రకటించారు. ఆయన ఇప్పటికే పార్టీ తరఫున మునుగోడులో పర్యటిస్తున్నారు.
అలాగే.. గౌడ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా గతంలో పనిచేసిన సుప్రీంకోర్టు న్యాయవాది శేషగిరిరావు గౌడ్ కూడా మునుగోడులో పోటీకి దిగనున్నారు. కొన్ని బీసీ, ఎస్సీ, ఎస్టీ సంఘాలు కలిసి ఈయనను అభ్యర్థిగా పెడతామని ప్రకటించాయి. నియోజకవర్గంలో 60శాతం మంది బీసీలే ఉన్నా.. అన్ని ప్రధాన పార్టీలూ అగ్రవర్ణాలకు చెందినవారికే టికెట్ ఇచ్చిన అంశాన్ని వీరు ప్రస్తావించనున్నారు.
బీసీ, ఎస్సీ, ఎస్టీల ఐక్యత.. వారి ప్రాధాన్యం తెలియాలంటే తమ అభ్యర్థులకే ఓటేయాలని బీఎస్పీ, ఈ సంఘాల నేతలు కోరనున్నారు.ఇక, ఎస్సీను మచ్చిక చేసుకునేందుకు ప్రజాశాంతి పార్టీ అధినేత రంగంలోకి దిగుతున్నారు. దీంతో మునుగోడు వాడి వేడిగా మారిపోయింది. మరి ఇక్కడి ప్రజలు ఎలాంటి తీర్పు ఇస్తారో చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.