బీజేపీ అధినాయకత్వం నుంచి ఆ పార్టీ ఏపీ శాఖకు చెందిన కీలక నేతలకు పిలుపు రావడంతో ఏపీ రాజకీయాల్లో ఒక్కసారిగా స్పీడు పెంచింది. బీజేపీ నేతలను ఆ పార్టీ అధిష్ఠానం పిలిచినప్పటికీ అది ఏపీ రాజకీయాలను - ఏపీ భవిష్యత్తును ప్రభావితం చేసే అవకాశాలుండడంతో దీనిపై ఆసక్తి ఏర్పడింది. ఏపీ బీజీపీలోని కొందరు ముఖ్య నేతలకు కొద్దిసేపటి క్రితం ఓ సందేశం వచ్చిందట... ఉన్నపళంగా ఢిల్లీ వచ్చేయాలన్నది దాని సారాంశం. మంగళవారం ఢిల్లీలో జరిగే బీజేపీ కోర్ కమిటీ భేటీకి హాజరు కావాలని వారిని ఆహ్వానించారు. దీంతో ఆహ్వానం అందిన నేతలంతా బ్యాగులు సర్దుకుంటున్నారు.
కాగా బీజేపీ కోర్ కమిటీ భేటీలో భాగంగా ఏపీకి సంబంధించిన వ్యవహారంపై కీలక చర్చ జరగనుందని సమాచారం. ఏపీ ప్రత్యేక హోదాపై ప్రస్తుతం జరుగుతున్న ఆందోళనలపై సమగ్ర సమాచారం సేకరించడంతో పాటు ఈ విషయంపై ఎలా ముందుకెళ్లాలన్న అంశంపైనా చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా నెలల తరబడి వాయిదా పడుతూ వస్తున్న ఏపీ బీజేపీ చీఫ్ పదవి ఎంపిక విషయంలోనూ నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. అయితే... రెండూ జరుగుతాయా.. లేదంటే ఏదో ఒక్కటే నిర్ణయమవుతుందా అన్నది తెలియాల్సి ఉంది.
మరోవైపు ఏపీ బీజేపీ నేతలు కూడా కోర్ కమిటీలో ఏం చెప్పాలనే విషయంలో స్పష్టమైన నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. హోదా ఇవ్వడమే బెటరని వారి చెప్పబోతున్నట్లు సమాచారం. ఇప్పుడిస్తున్నట్లుగా కానీ, ప్రత్యేక ప్యాకేజీ పేరుతో కానీ ఎన్ని నిధులిచ్చినా చంద్రబాబు ప్రభుత్వం వాటిని ఇతర పనులకు మళ్లించేస్తుందని... వాటన్నిటినీ తన ఘనతగానే చెప్పుకుంటుందని.. అందువల్ల కేంద్రం ఎంతిచ్చినా కూడా ప్రజల్లో పేరు రాదని ఏపీ బీజేపీ నేతలు అభిప్రాయపడుతున్నారు. అదే హోదా ఇస్తే కనుక ప్రజలకు ఆ విషయం స్పష్టంగా చేరి బీజేపీ హీరో అవుతుందని.. వచ్చే ఎన్నికల్లో అది మంచి లాభం చేకూరుస్తుందని అధిష్ఠానానికి చెప్పాలనుకుంటున్నట్లు సమాచారం.