జీహెచ్ఎంసీలో బీజేపీకి ఆ 4 సీట్లు ప‌క్కా.... మిగిలిన‌వే వాళ్ల‌కు...!

Update: 2022-01-27 13:30 GMT
తెలంగాణ‌లో మ‌రోసారి సీఎం కేసీఆర్ ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు వెళ‌తార‌న్న ప్ర‌చారం అయితే బ‌లంగా వినిపిస్తోంది. ప్ర‌తిప‌క్షాలు ఇప్ప‌ట‌కీ అక్క‌డ నిస్తేజ స్థితిలోనే ఉన్నాయి. వాళ్ల‌కు ఏ మాత్రం పుంజుకునే అవ‌కాశం లేకుండానే కేసీఆర్ ఎన్నిక‌ల‌కు వెళ్లిపోతార‌ని అంటున్నారు. వీళ్ల అంచ‌నాలు నిజం అయితే 2023 ఆరంభంలోనే తెలంగాణ ఎన్నిక‌లు ఉంటాయి. ఇక ఎవ‌రి అంచ‌నాలు ఎలా ?  ఉన్నా కీల‌క‌మైన జీహెచ్ఎంసీ ప‌రిధిలో ఈ సారి ప‌రిస్థితులు ఎలా ఉంటాయ‌న్న దానిపై కూడా ర‌క‌ర‌కాల చ‌ర్చ‌లు న‌డుస్తున్నాయి. గ్రేట‌ర్ హైద‌రాబాద్ ప‌రిధిలో మొత్తం 24 ఎమ్మెల్యే సీట్లు ఉన్నాయి.

ఈ సీట్ల‌లో మ‌జ్లిస్‌కు 7 సీట్లు తీసి ప‌క్క‌న పెట్టేయాలి. పాత బ‌స్తీలో  హైద‌రాబాద్ లోక్‌స‌భ ప‌రిధిలో ఉన్న ఆరు ఎమ్మెల్యే సీట్ల‌తో పాటు సికింద్రాబాద్ లోక్‌స‌భ ప‌రిధిలో ఉన్న నాంప‌ల్లి సీటు కూడా గ‌త మూడు ఎన్నిక‌ల్లోనూ ఎంఐఎం ఖాతాలోనే ప‌డుతోంది. ఇక మిగిలిన 17 సీట్ల విష‌యానికి వ‌స్తే టీఆర్ఎస్‌, కాంగ్రెస్‌, బీజేపీల్లో ఎవ‌రికి ఎన్ని సీట్లు వ‌స్తాయ‌న్న‌దే తేల్చుకోవాల్సి ఉంది.

ఈ గ్రేట‌ర్ ప‌రిధిలో ఎవ‌రు ఎక్కువ సీట్లు గెలుచుకుంటారో ?  వారికే కాస్త ఎక్కువ ఎడ్జ్ ఉంటుంది అన్న‌ది సుస్ప‌ష్టం. తాజాగా ఈ మూడు పార్టీల్లో ఓ పార్టీ చేసిన స‌ర్వేలో సెంట‌ర్ ఆఫ్ ద సిటీలో మూడు సీట్లు బీజేపీకి ప‌క్క‌గా వ‌స్తాయ‌ని తేలింద‌ట‌. ఆ సీట్ల‌ను గ‌తంలోనూ ఆ పార్టీ గెలుచుకున్న‌వే. ఇక సిటీ అవుట్ క‌ట్స్‌లో మ‌రో సీటు బీజేపీ ఖాతాలో ప‌డుతుంద‌ని ఈ సర్వేలో వ‌చ్చింద‌ట‌.

బీజేపీ ఖాతాలో నాలుగు సీట్లు ప‌డితే.... టీఆర్ఎస్‌కు 5 గ్యారెంటీ అని స‌ర్వే చెప్పింది. ఇక అనూహ్యంగా కాంగ్రెస్ ఇక్క‌డ బాగా పుంజుకుంద‌ని.. ఆ పార్టీకి కూడా 4 సీట్లు ప‌క్కా అని చెప్పింది. కాంగ్రెస్ గెలుచుకునే సీట్ల‌లో మూడు సీట్లు మ‌ల్కాజ్‌గిరి పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలోనివే అని టాక్ ?  ఇక టీఆర్ ఎస్ - కాంగ్రెస్ మ‌ధ్య 8-9 సీట్ల‌లో ఫైట్ ఉండే ఛాన్సులు ఉన్నాయి. ఈ సీట్ల‌లో కాంగ్రెస్ బ‌ల‌మైన అభ్య‌ర్థుల‌ను పెడితే మ‌రిన్ని మెరుగైన ఫ‌లితాలు సాధించ‌వ‌చ్చ‌ని అంటున్నారు.

గ్రేట‌ర్ ప‌రిధిలో రెండు, మూడు సార్లు గెలిచిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేల మీద వ్య‌తిరేక‌త ఎక్కువుగానే ఉంది. ఇక్క‌డ బీజేపీ కూడా మంచి ఓటు షేరింగ్ సాధించే అవ‌కాశాలు ఉన్నాయి. ఇక కాంగ్రెస్‌, బీజేపీలు బ‌ల‌మైన అభ్య‌ర్థుల‌ను పోటీలో పెట్ట‌డం ద్వారా ఇక్క‌డ కారు పార్టీ జోరుకు బ్రేకులు వేసేందుకు మంచి అవ‌కాశం అయితే ఉంది. ఓవ‌రాల్‌గా ఇక్క‌డ కాంగ్రెస్‌, టీఆర్ఎస్ మ‌ధ్యే ఎక్కువ సీట్ల‌లో పోటీ ఉండేలా ఉంది.
Tags:    

Similar News