పాపం రాజగోపాల్ ఇలాగైపోయాడే !

Update: 2022-10-14 06:54 GMT
ఏమైందో ఏమోగానీ బీజేపీ అభ్యర్ధిగా మునుగోడు అసెంబ్లీ ఉపఎన్నికలో పోటీచేస్తున్న కోమటిరెడ్డి రాజగోపాల్ కు తానేం మాట్లాడుతున్నాడో కూడా తెలీటంలేదు.  ఎన్నికల ప్రచారంలో అనవసరంగా చెత్తను నెత్తినేసుకుంటున్నారు.

తాజాగా ఒకచోట ప్రచారంలో మాట్లాడుతు ఎక్కడి ముసలోళ్ళురా నాయన వీళ్ళతో పెద్ద చావుకొచ్చిందే ? అని ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రచారంలో ఎక్కడకు పోయినా ఈ ముసలోళ్ళతోనే సస్తున్నాం అంటు తీవ్ర అసహనం వ్యక్తంచేశారు.

ముసలోళ్ళు వేయబట్టే కారుగుర్తు రెండుసార్లు అధికారంలోకి వచ్చింది అవునా కాదా అంటు జనాలను అడిగారు. పైగా తలకొట్టుకుంటు జనాలను ప్రశ్నించటం ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వృద్ధుల గురించి, కేసీయార పరిపాల గురించి ప్రచారంలో మాట్లాడుతుంటే అక్కడే ఉన్న కొందరు ముసలోళ్ళు వెంటనే కేసీయార్ కు జై అంటు కేకలు పెట్టారు. ఆసరా పెన్షన్లు ఇచ్చి కేసీయార్ తమలాంటి వాళ్ళకి అండగా నిలుస్తున్నట్లు గట్టిగా అరచిచెప్పారు. దాంతో రాజగోపాల్ సహనం కోల్పోయి నోటికొచ్చింది మాట్లాడేశారు.

ఈమధ్యనే ఒక టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో మాట్లాడుతు తాను చాలాకాలంగా బీజేపీతో టచ్ లో ఉన్నట్లు చెప్పారు. అంతేకాకుండా తాను బీజేపీలో చేరటానికి ముందు రు. 18 వేల కోట్ల కాంట్రాక్టు దక్కిందని చెప్పుకోవటం పెద్ద వివాదాస్పదమయ్యింది. రు. 18 వేల కోట్ల కాంట్రాక్టు కోసమే రాజగోపాలరెడ్డి కాంగ్రెస్ కు రాజీనామా చేసి బీజేపీలో చేరారని మొదటినుండి రేవంత్ రెడ్డి అండ్ కో ఆరోపిస్తున్న విషయం తెలిసిందే.

అప్పట్లో అవన్నీ ఉత్త ఆరోపణలు మాత్రమే అని కొట్టిపడేసిన రాజగోపాల్ ఇపుడదే మాటను ఇంటర్వ్యూలో అంగీకరించటం గమనార్హం. ఎన్నికల ప్రచారంలో అందులోను అభ్యర్ధిగా ఉన్న రాజగోపాల్ చాలా జాగ్రత్తగా మాట్లాడాలి.

ఇపుడు నోరుజారి చిన్నమాట పొరబాటుగా ఏమన్నా అన్నా వెంటనే సోషల్ మీడియాలో వైరల్ అయిపోతోంది. తర్వాత తలపట్టుకున్నా ఉపయోగం ఉండదు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News