ఏపీ సర్కారు ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న పట్టిసీమ ప్రాజెక్టుకు చికాకులు తప్పటం లేదు. ఈ ప్రాజెక్టు విషయంలో ఏపీ విపక్షం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీవ్రస్థాయిలో విరుచుకుపడటం.. పట్టిసీమ ప్రాజెక్టు వృధా అని.. వందల కోట్ల రూపాయిల ప్రజాధనం వృధా కానుందని ఆరోపించటం తెలిసిందే. చంద్రబాబు నాయుడు అండ్‌కోకు నిధులు ముట్టినందుకే పట్టిసీమను కట్టిస్తున్నారంటూ జగన్ ఆరోపణలు చేశారు.
నిజంగా చంద్రబాబుకు డబ్బులే కావాలంటే పట్టిసీమనే నిర్మాంచాల్సిన అవసరం ఏముంది? ఏ ప్రాజెక్టును చేపట్టినా డబ్బులు ఇవ్వటానికి పారిశ్రామికవేత్తలు అంగీకరించరా? నిధుల కోసమే పట్టిసీమను నిర్మిస్తున్నారన్న దానిపై జగన్ చేస్తున్న ఆరోపణలు అర్థం లేనివని చెప్పొచ్చు. ఈ కారణంతో కావొచ్చు.. జగన్ అంత తీవ్రస్థాయిలో విమర్శలు చేసినా ఏపీ ప్రజలు పెద్దగా పట్టించుకున్నట్లుగా కనిపించలేదు.
అదేసమయంలో పట్టిసీమపై ఏపీ విపక్షం చేసి దాడిని తిప్పికొట్టే ప్రయత్నంలో ఏపీ అధికారపక్షం అంత ప్రభావవంతంగా వ్యవహరించనప్పటికీ.. బాబు మీద ఉన్న భరోసా.. జగన్ మీద ఉన్న సందేహం ఏపీ సర్కారుకు రక్షగా మారింది.
ఇదిలా ఉంటే.. తాజాగా టీడీపీ మిత్రపక్షమైన బీజేపీ సైతం పట్టిసీమపై సముఖంగా లేదని..ఈ ప్రాజెక్టు వల్ల నష్టమే తప్ప లాభం ఉండదన్న భావనలో ఉన్నట్లు వస్తున్న సమాచారం తెలుగుతమ్ముళ్లలో కొత్త గుబులు రేపుతోంది. విపక్షం విరుచుకుపడితే ఏదో విధంగా సర్ది చెప్పగలిగారు కానీ.. ఏకంగా అధికారపక్షానికి మిత్రులైన బీజేపీ నేతలు పట్టిసీమ ప్రాజెక్టు వృధా అంటే మాత్రం బాబు సర్కారుకు జరిగే డ్యామేజ్ ఎక్కువ.
బీజేపీ నేత విశ్వేశ్వరయ్య.. పట్టిసీమ అంశంపై గోదావరి జిల్లాల్లో పర్యటించి అక్కడి రైతుల అభిప్రాయం తీసుకునే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా వారు.. తమ నీటిని రాయలసీమకు తరలిస్తున్నారన్న వేదననువ్యక్తం చేసినట్లు చెబుతున్నారు. అంతేకాదు.. పట్టిసీమ కారణంగా పోలవరం ప్రాజెక్టుకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉందన్న మాటను చెప్పినట్లుగా చెబుతున్నారు. మరోవైపు విశ్వేశయ్య మీడియాతో మాట్లాడుతూ.. పట్టిసీమ కారణంగా సీమకు సైతం పెద్దగా ప్రయోజనం జరగదని వ్యాఖ్యానించటం గమనార్హం.
పట్టిసీమ ప్రాజెక్టుపై ఆయన చేసిన మరో సూచన ఏపీ సర్కారుకు తలనొప్పిగా మారే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పట్టిసీమ ప్రాజెక్టుకు ఖర్చు పెట్టే రూ.1100కోట్లను.. సీమలోని పెండింగ్ ప్రాజెక్టులకు ఖర్చు చేసి పూర్తి చేస్తే లాభం జరుగుతుందని కదా అని చెబుతున్నారు. అదే చేస్తే.. ప్రాజెక్టులు మొదలుపెట్టిన పార్టీలకు ఇప్పుడు మైలేజీ రావటం ఖాయం. అదే జరిగితే.. బాబు రాజకీయ ప్రయోజనం.. మైలేజీ ఏమైపోవాలి..?