ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై మిత్రపక్షమైన బీజేపీలోని కొందరు నేతలు గుర్రుగా ఉన్నారనే వార్తలు ఎప్పట్నుంచో వెలువడుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే గిల్లికజ్జాలతో సాగుతున్న టీడీపీ-బీజేపీ దోస్తీ ఇటీవల పరస్పర విమర్శలు సైతం మొదలయ్యాయి. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో బీజేపీ శాసనసభా పక్ష నేత విష్ణుకుమార్ రాజు మరో అడుగు ముందుకు వేశారు. ప్రజా సంక్షేమం కోణంలో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే ఏ అంశాన్నీ ఆయన వదులుకోవడం లేదు. ఈ క్రమంలో ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీకి సైతం ఆయన మద్దతు ఇచ్చారు. కాగా తాజాగా విష్ణుకుమార్ రాజు మీడియాతో మాట్లాడుతూ ఏపీ ప్రభుత్వం తీరును తమను సిగ్గు పడేలా చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
బీజేపీ సీనియర్ నేత అయిన విష్ణుకుమార్ రాజు ఏపీ సర్కారుపై ఇంతగా ఆగ్రహం వ్యక్తం చేసేందుకు కారణం...నూతన అసెంబ్లీ నిర్మాణమే. ఈ నిర్మాణంలో భాగంగా బీజేపీ శాసనసభా పక్షం కోసం ఇచ్చిన గది విష్ణుకుమార్ రాజు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ బీజేపీకి మరీ ఇంత చిన్న గదా అంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఢిల్లీ నుంచి బీజేపీ పెద్దలు వస్తే వారిని అసెంబ్లీకి తీసుకురావాలన్నా సిగ్గేస్తోందని అన్నారు. బీజేఎల్పీ రూమ్ చూస్తే తనది చేతగానితనం అనే భావన ఢిల్లీ పెద్దలకు కలుగుతుందని, అందుకే వారిని పిలవడం లేదని తన పరిస్థితిని ఆవేదన భరితంగా రాజు పంచుకున్నారు. బీజేఎల్పీ కార్యాలయం అష్టవంకర్లతో ఉందని, ఇది ఫ్లోర్ లీడర్‌కు కేటాయించే రీతిలో ఉందా అని వ్యాఖ్యానించారు.
బీజేపీకి ఇచ్చిన కార్యాలయంలో బాత్ రూమ్ లేదని తను మంత్రులను అడిగితే షాక్‌కు లోనయ్యే సమాధానం వచ్చిందని విష్ణుకుమార్ రాజు అన్నారు. `మీకు లేదంటున్నారు..మాదీ అదే పరిస్థితి` అని మంత్రులు తనతో చెప్పారని ఆయన వాపోయారు. ఆరుగురు మంత్రులకు ఒకే బాత్రూమ్ కేటాయించడం దారుణమని మండిపడ్డారు. స్కూళ్లు, కాలేజీలు కట్టినట్టు అసెంబ్లీని కట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకా ఇలాంటి బిల్డింగ్‌ను అహా..ఓహో అంటూ ప్రచారం చేసుకున్నారని రాజు అసహనం వ్యక్తం చేశారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/