‘‘దున్నపోతు ఈనిందిరా..’’ అంటే... ‘‘దూడను గాటన కట్టేయ్..’’ అని పురమాయించాట్ట వెనకటికి ఓ ప్రబుద్ధుడు. ఒక మాట వినిపించగానే.. అందులో నిజానిజాలు తెలుసుకోకుండా, లోతు గురించి ఆలోచించకుండా.. గుడ్డిగా స్పందించడం గురించి పెద్దలు ఇలా వెటకారం చేస్తుంటారు. ప్రస్తుతం రాజకీయాలను గమనించినా కూడా అలాగే కనిపిస్తోంది. ప్రత్యేకించి ప్రధాని నరేంద్ర మోడీ అనుకూల ప్రచారం నిర్వహించడంలో ముందంజలో ఉండే కోటరీ ఈ విషయంలో చాలా యాక్టివ్ గా ఉన్నట్టు కనిపిస్తోంది. ఎందుకంటే.. ప్రపంచంలో ఏ రాజకీయ పరిణామం జరిగినా సరే.. అది కేవలం మోడీ చొరవ వల్ల మాత్రమే ఆ రకంగా జరిగినట్లుగా ప్రచారం చేయడంలో - ఇతర దేశాధినేతలు తీసుకుంటున్న నిర్ణయాల క్రెడిట్ ను కూడా మోడీ ఖాతాలో వేయడంలో వారు చెలరేగుతున్నారు.
తాజాగా పాకిస్తాన్ విషయంలో అగ్ర రాజ్యం అమెరికా వైఖరి మారుతున్న సంకేతాలు అంతర్జాతీయ యవనికపై కనిపిస్తున్నాయి. సుదీర్ఘకాలంగా పాకిస్తాన్ కు ఆర్థిక సాయం అందిస్తున్న అమెరికా.. ఇకపై దానిని కొనసాగించకపోయే పరిస్థితి ఉత్పన్నం అవుతోంది. ఈ విషయంలో ఇంకా స్పష్టమైన నిర్ణయం వెలువడకపోయినప్పటికీ.. అధ్యక్షుడు ట్రంప్ మాట్లాడుతున్న మాటలు మాత్రం.. పాకిస్తాన్ కు సాయం ఆగిపోవచ్చుననే విధంగానే ఉంటున్నాయి. ఉగ్రవాదాన్ని అరికట్టడం కోసం తాము పాకిస్తాన్ కు సాయం చేస్తున్నాం అని.. ఒకవైపు తాము ఆఫ్గనిస్తాన్ లో ఉగ్రవాదులకోసం వేటాడుతోంటే.. వారికి పాక్ తమ దేశంలో ఆశ్రయం కల్పిస్తున్నదని - పాక్ నమ్మకద్రోహం చేస్తున్నదని ట్రంప్ తాజాగా వ్యాఖ్యానించడంతో.. ఇలాంటి సందేహాలు రేకెత్తుతున్నాయి.
పాకిస్తాన్ కు సాయం ఆగిపోవడం అనేది అమెరికా దౌత్యపరమైన నిర్ణయం. అయితే.. అమెరికా ఇలాంటి నిర్ణయం తీసుకోవడం వెనుక అసలు క్రెడిట్ నరేంద్ర మోడీ దే అన్నట్లుగా భాజపా ప్రచారం చేసుకుంటున్నది. మోడీ దౌత్యపరంగా చూపించిన ప్రభావం వల్లనే - పాక్ దుశ్చర్యల గురించి అమెరికా దృష్టికి సమర్థంగా తీసుకువెళ్లగలిగినందునే ... పాక్ విషయంలో అగ్రరాజ్యం తమ వైఖరి మార్చుకుంటున్నదని.. సాయం ఆపేయడానికి ట్రంప్ నిర్ణయం తీసుకోబోతున్నారని.. పాక్ తో సంబంధాల విషయంలో విమర్శలు చేసే కాంగ్రెస్ వారు దీనిని గుర్తించాలని... ఇలా రకరకాలుగా మోడీని కీర్తించడానికి ఈ ట్రంప్ ప్రసంగాన్ని భారతీయ జనతా పార్టీ వాడుకుంటున్నది.
ట్విస్టు ఏంటంటే.. పాక్ కు ప్రస్తుతం అమెరికా నుంచి 1627 కోట్ల రూపాయల ఆర్థిక సాయం విడుదల కావాల్సి ఉంది. విడుదలలో జాప్యం జరుగుతోంది. అమెరికా ఇలా పైకి విమర్శస్తూనే, హెచ్చరిస్తూనే సాయాన్ని మాత్రం కొనసాగించడం సాధారణంగా జరుగుతుంటుంది. అయితే ఈ సందర్భంలో సాయం ఆగిపోవచ్చుననే పుకార్లు రావడంతో.. (ఇంకా ఆ సాయం రద్దయినట్లు ప్రకటన రాలేదు) అప్పుడే విజయం సాధించేసినట్లుగా మోడీని స్తుతించేయడానికి - ఆ కీర్తిని కబ్జా చేయడానికి భాజపా శ్రేణులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నాయి అని ప్రజలు అనుకుంటున్నారు.