త్వరలో జరిగే హుజూర్ నగర్ ఉప ఎన్నికలతో తెలంగాణ రాజకీయం వేడెక్కింది. ఇప్పటికే టీఆర్ఎస్ తన అభ్యర్థిని ఖరారు చేయటం.. కాంగ్రెస్ సైతం ఉత్తమ్ సతీమణిని బరిలోకి దింపేందుకు దాదాపుగా రెఢీ కావటం తెలిసిందే. ఇలాంటివేళ.. రానున్న రోజుల్లో తమదే అధికారమని అదే పనిగా చెబుతున్న బీజేపీ నేతలు.. తమ అభ్యర్థిని ఎవరిని బరిలోకి దించుతారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
ఇదిలా ఉంటే ఈ రోజు జరిగే తెలంగాణ బీజేపీ కోర్ కమిటీ సమావేశంలో హుజూర్ నగర్ ఉప ఎన్నికల అంశంపై ప్రధానంగా చర్చ జరగటమే కాదు.. బలమైన అభ్యర్థిని బరిలోకి దింపాలన్న యోచనలో ఉన్నట్లుగా చెబుతున్నారు. అంతేకాదు.. ఉప ఎన్నిక వ్యూహాన్ని అధినాయకత్వం సిద్ధం చేయనుంది. ఇదిలా ఉంటే.. బీజేపీ అభ్యర్థి ఎవరు? అన్న దానిపై ఆసక్తికర చర్చ జరుగుతోంది.
ఇప్పటివరకూ ఉన్న సమాచారం ప్రకారం కోదాడ మాజీ ఎమ్మెల్యే జితేందర్ రెడ్డి కుమార్తె శ్రీకళారెడ్డి పేరును ఇటీవల పార్టీలో చేరిన గరికపాటి మోహన్ రావు ప్రతిపాదించినట్లుగా తెలుస్తోంది. అయితే.. బీజేపీ ముఖ్యనేతల ఆలోచన వేరేగా ఉందంటున్నారు.
టీఆర్ ఎస్ మీద విపరీతమైన అసంతృప్తితో ఉన్న శంకరమ్మను పార్టీలోకి ఆహ్వానించి టికెట్ ఇస్తే బాగుంటుందన్న ఆలోచనలో ఉన్నట్లుగా చెబుతున్నారు. దీనికి తగ్గట్లే తెలంగాణ కమలనాథులకు శంకరమ్మ టచ్ లో ఉన్నట్లుగా చెబుతున్నారు. ఆమెను బరిలోకి దించితే పోటీ రసకందాయంగా మారుతుందని అంటున్నారు.
ఇదిలా ఉంటే.. వీరిద్దరికంటే భిన్నంగా 2018లో బీజేపీ బరిలోకి దింపిన భాగ్యారెడ్డికి టికెట్ ఇవ్వాలని కొందరు కోరుతున్నా.. పార్టీ మాత్రం ససేమిరా అన్నట్లు చెబుతున్నారు. ఆ ఎన్నికల్లో బీజేపీకి దారుణమైన ఫలితం ఎదురైంది. నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చిన నేపథ్యంలో.. ఈసారి ఎన్నికల్లో మెరుగైన ఓట్లను సాధించాలన్న పట్టుదలతో బీజేపీ నేతలు ఉన్నట్లు చెబుతున్నారు. ఈ క్రమంలో భాగ్యారెడ్డికి టికెట్ ఇవ్వకూడదని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఏమైనా.. బీజేపీ అభ్యర్థిక ఎంపికతో పోటీ తీవ్రత ఏ స్థాయిలో ఉంటుందో తెలుస్తుందని చెప్పక తప్పదు.