నేతలు ఎవరైనా హద్దుల్లోనే ఉండాలి. ప్రశాంతతను దెబ్బ తీసేలా.. అవతలి వారి మనోబావాల్ని గాయపరిచేలా మాట్లాడే హక్కు ఎవరికి లేదు. ఈ విషయంలో ఏ పార్టీకి చెందిన నేత అయినా హద్దులు దాటితే చట్టం తన పని తాను చేయాల్సిందే. తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసే హైదరాబాద్ లోని గోషామహాల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ తాజాగా చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి.
అయోధ్యలో రామమందిర నిర్మాణాన్ని ప్రస్తావించిన ఆయన.. రామాలయాన్ని నిర్మించటం ఖాయమని తేల్చారు. ఎట్టి పరిస్థితుల్లో అయినా అయోధ్యలో రామాలయాన్ని నిర్మించి తీరుతామని.. ఎవరైనా అడ్డొస్తే అడ్డంగా నరికేస్తానని.. రామాలయ నిర్మాణంలో ప్రాణాలు ఆర్పించేందుకైనా.. ప్రాణాలు తీసేందుకైనా సిద్ధమన్నారు.
ఈ నెల 5న జరిగిన శ్రీరామనవమి సందర్భంగా ధూల్ పేట్ లోని జుమ్మెరాత్ బజార్‌లో ప్రసంగించారు. దానికి సంబంధించిన వీడియో ఒకటి తాజాగా బయటకు వచ్చి వైరల్ గా మారింది. ఈ వీడియోలో రాజాసింగ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి.
రామాలయ నిర్మాణం కోసం ప్రాణాలు తీయటానికైనా.. ప్రాణాలు ఇవ్వటానికైనా తాను సిద్ధమని చెప్పటమేకాదు.. రామాలయనిర్మాణం ఆపటం ఎవరి తరం కాదని తేల్చారు.
హిందుస్తాన్‌లో హిందువులకు వ్యతిరేకంగా ఉండే వారికి స్థానం లేదన్న రాజాసింగ్.. త్వరలో యూపీ ముఖ్యమంత్రి యోగి అదిత్యనాథన్ రామాలయ నిర్మాణాన్ని ప్రారంభిస్తారని చెప్పారు. రాజాసింగ్ వివాదాస్పద వీడియో బయటకు వచ్చి.. వైరల్ అయిన నేపథ్యంలో ఎంబీటీ నేత అంజదుల్లా కాన్ దబీర్ పురా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇతర వర్గాల వారిని రెచ్చగొట్టేలా.. శాంతిభద్రతలకు ప్రశ్నార్థకంగా మారే ఎవరినీ ఉపేక్షించకూడదు. ఈ విషయంలో ఏ మాత్రం నిర్లక్ష్యం వహించినా అందుకు భారీ మూల్యాన్ని చెల్లించాల్సి ఉంటుంది. బాధ్యతారాహిత్యమైన ఈ తరహా వ్యాఖ్యల పట్ల కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/